CPR: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా సీపీ ఆర్ చేస్తే.. ప్రాణాలు సేఫ్

CPR:మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువ మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. అయితే గుండె పోటు వచ్చిన వెంటనే సరైన చికిత్స లేకపోవడం కూడా ఒక సమస్యే. గుండె పోటు వచ్చిన వెంటనే గుర్తించి సీపీ ఆర్ సరిగ్గా చేస్తే తప్పకుండా ప్రాణాలతో బతుకుతారు. అయితే మనలో చాలా మందికి గుండె పోటు వస్తే సీపీ ఆర్ ఎలా చేస్తే ప్రాణాలు కాపాడవచ్చో కూడా సరిగ్గా తెలియదు. అయితే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) అనేది సరిగ్గా చేస్తే మనిషి ప్రాణాలను బతికించవచ్చు. అయితే సీపీఆర్ అనేది మనిషికి ఎలా చేస్తే ప్రాణాలతో బయట పడతారో ఈ స్టోరీలో చూద్దాం.
కార్డియోపల్మోనరీ రిససిటేషన్ అనేది గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడే టెక్నిక్. గుండె పోటు వచ్చినప్పుడు ఛాతీపై కుదింపు చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆగిపోయిన గుండెకు ఆక్సిజన్ అందుతుంది. దీంతో ప్రాణాలతో బయట పడతారు. అయితే ఎవరైతే సడెన్‌గా పడిపోయి ఊపిరి ఆడటం లేదో వారికి సీపీఆర్ చేయాలి. గుండె పోటు వచ్చినప్పుడు వెంటనే సీపీఆర్ చేయడం వల్ల వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు. అయితే మొత్తం రెండు రకాల సీపీఆర్‌లు ఉన్నాయి. ఒకటి హ్యాండ్ సీపీఆర్, రెండోది మౌత్ సీపీఆర్. హ్యాండ్ సీపీఆర్‌లో, రోగి ఛాతీని అర చేతులతో నొక్కి ఉంచుతారు. అదే మౌత్ సీపీఆర్‌లో రోగికి నోటి ద్వారా ఆక్సిజన్ ఇస్తారు. ఇలా చేయడం వల్ల వారు ప్రాణాలతో బయటపడతారు. గుండె పోటు వచ్చిన వెంటనే చేయడం వల్ల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సీపీఆర్‌ను చేసే ముందుగా ఎడమ చేతిని నిఠారుగా ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని ఛాతీపై ఉంచి కుడి చేతి వేళ్లను లోపలికి తిప్పి మూసి వేయాలి. ఇలా రోగి ఛాతీ మధ్యలో అర చేతులను వేగంగా నొక్కడం వల్ల బాడీకి రక్తపసరణ జరిగి ఆక్సిజన్ అందుతుంది. దీంతో వెంటనే వారు ప్రాణాలతో బయటపడతారు. దాదాపుగా 100 నుంచి 120 సార్లు చేయడం వల్ల ప్రాణాలు బతుకుతాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తె ప్రమాదం తగ్గుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Loans: తాత్కాలిక లోన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇక మీకు చావే
-
Prakash Raj: కోట శ్రీనివాస రావు అందరికీ నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం