Jio vs Airtel Recharge Plans: రూ.50 తేడాతో భారీ ప్రయోజనాలు: జియో 299 vs ఎయిర్‌టెల్ 349 ప్లాన్ ఏది బెస్ట్ ?
Jio vs Airtel Recharge Plans: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్... ఈ రెండు కంపెనీలు తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈరోజు మనం జియో రూ.299 ప్లాన్, ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌ల ప్రయోజనాలు, వాలిడిటీని తెలుసుకుందాం.

Jio vs Airtel Recharge Plans: ప్రస్తుతం మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు ఎంచుకోవడం ఒక సవాల్‌గా మారింది. రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్ డేటా కావాలి అనుకుంటే ఏ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్… ఈ రెండు కంపెనీలు తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈరోజు మనం జియో రూ.299 ప్లాన్, ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌ల ప్రయోజనాలు, వాలిడిటీని తెలుసుకుందాం.
జియో రూ.299 ప్లాన్
రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
ఈ ప్లాన్‌తో వచ్చే అదనపు ప్రయోజనాలు
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్: ఈ ప్లాన్ తీసుకున్న ప్రీపెయిడ్ యూజర్లకు జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీని కింద 90 రోజుల పాటు ఉచితంగా జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ యాక్సెస్ లభిస్తుంది.
జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్: అదనంగా 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్ కూడా ఉంటుంది.
జియో హాట్‌స్టార్ ప్రయోజనం రెండవ, మూడవ నెలల్లో కూడా కావాలంటే ఈ ప్లాన్ వాలిడిటీ ముగియడానికి 48 గంటల ముందుగానే తదుపరి రీచార్జ్ చేసుకోవాలి. రిలయన్స్ జియో టీవీకి ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
Also Read: Viral Video: అన్నా మళ్లొచ్చినా.. ప్రపంచాన్ని ఊపేస్తున్న థాయ్ పాటలు.. ఇంకోటి వచ్చిందండోయ్
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ కూడా 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది.
ఈ ప్లాన్‌తో వచ్చే అదనపు ప్రయోజనాలు
స్పామ్ అలర్ట్స్: ఈ ప్లాన్ స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి అలర్ట్స్ (హెచ్చరికలు) అందిస్తుంది.
ఫ్రీ హలోట్యూన్: 30 రోజులలో ఒకసారి ఉచితంగా హలోట్యూన్‌ను సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: Viral Video: చీమల మాదిరి రోడ్డు మీద క్యూ కట్టిన చేపలు.. వీడియో వైరల్
జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌లు రెండూ ఒకే రకమైన డేటా (రోజుకు 1.5GB), వాలిడిటీ (28 రోజులు) అందిస్తున్నాయి. అయితే, అదనపు ప్రయోజనాలలో మాత్రం తేడా ఉంది.
జియో రూ.299 ప్లాన్: ఎయిర్‌టెల్ ప్లాన్ కంటే రూ.50 తక్కువ ధరలో వచ్చి, 90 రోజుల జియో హాట్‌స్టార్ యాక్సెస్, 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎంటర్ టైన్ మెంట్, స్టోరేజ్ సంబంధిత ప్రయోజనాలను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్: జియో కంటే రూ.50 ఎక్కువ ధరలో వచ్చి, స్పామ్ అలర్ట్స్, ఫ్రీ హలోట్యూన్ వంటి చిన్నపాటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలి అనేది మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. హాట్‌స్టార్ యాక్సెస్, క్లౌడ్ స్టోరేజ్ ముఖ్యమైతే జియో ప్లాన్ మంచిది. అలా కాకుండా స్పామ్ అలర్ట్స్ వంటివి కావాలంటే ఎయిర్‌టెల్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
BSNL : బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఇక మీద ఇంటివద్దకే సిమ్ కార్డ్
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Recharge Plan : జియో, ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?