Viral Video: అన్నా మళ్లొచ్చినా.. ప్రపంచాన్ని ఊపేస్తున్న థాయ్ పాటలు.. ఇంకోటి వచ్చిందండోయ్
Viral Video: కేవలం సాధారణ నెటిజన్లే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ పాటకు ఫిదా అయిపోయారు. సుమారు 1.02 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.

Viral Video: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఒక థాయ్ పాట ఓ ఊపు ఊపేస్తోంది. ఆ పాటే ‘అన్నన పాథియే’ (Annana pathiya appata ketiya). దాని అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. ఆ పాటలోని పదాలు నోటికి రానివారు కూడా దానికి తగ్గ రిథమ్‌ను, హుక్ స్టెప్లను అనుకరిస్తూ రీల్స్ చేస్తున్నారు. కేవలం సాధారణ నెటిజన్లే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ పాటకు ఫిదా అయిపోయారు. సుమారు 1.02 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.
‘అన్నన పాథియే’ (Annana pathiya appata ketiya) అనేది ఒక థాయ్ పదబంధం. థాయ్ ప్రజలు ఒక వ్యక్తిపై తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, లేదా తమ ఆత్మీయతను పంచుకోవడానికి ఈ పదాలను ఉపయోగిస్తూ పాటలు పాడుతుంటారు. ఈ పాటలోని సంగీతం, రిథమ్ చాలా ఆకర్షణీయంగా ఉండడంతో భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read: Viral Video: చీమల మాదిరి రోడ్డు మీద క్యూ కట్టిన చేపలు.. వీడియో వైరల్
‘అన్నన పాథియే’ అనే పదబంధాన్ని తొలిసారి ‘టోంగ్ బావో క్రాహ్మోమ్’ అనే ఆల్బమ్ కోసం ఉపయోగించారు. థాయ్ గాయకుడు సాక్ పక్నం తనదైన శైలిలో ఈ పాటను ఆలపించారు. ఒక వ్యక్తి తన ప్రియురాలిపై ప్రేమను తెలియజేస్తూ, దానికి కాస్త హాస్యాన్ని జోడించి సరదాగా పాడారు. ఈ పాట స్థానికంగా అప్పట్లో విశేష ఆదరణను సొంతం చేసుకుంది. దాని ప్రజాదరణను చూసి, 2010లో వచ్చిన ‘ది హోలీ మ్యాన్ 3’ అనే సినిమా కోసం ఈ లిరిక్స్‌ను మళ్ళీ ఉపయోగించారు. దీంతో ఈ పాట థాయ్‌లాండ్‌లో మరింతగా పాపులర్ అయింది.
‘అన్నన పాథియే’ పాట ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ కావడానికి ప్రధాన కారణం ఇండోనేషియాకు చెందిన యువ గాయని నికెన్ సలింద్రి. నికెన్ చిన్నతనం నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తిని పెంచుకుంది. ఆమె తండ్రి కూడా సంగీతకారుడు కావడంతో, చిన్నతనంలోనే తండ్రితో కలిసి అనేక స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చింది. కేవలం రెండేళ్ల వయసులోనే గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించిన నికెన్, ఆ తర్వాత ఒక ఆర్కెస్ట్రా బృందంలో చేరింది. థాయ్‌లాండ్‌తో పాటు చుట్టుపక్కల నగరాల్లో వరుస ప్రదర్శనలు ఇచ్చి అద్భుతమైన గుర్తింపును తెచ్చుకుంది. మళ్లీ ఆమె మరో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి పాట అన్నన పాథియే అంత జోష్ లేకపోయినా కాస్త ఊపు తెప్పిస్తోంది. మరి ఈ పాట సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.
నికెన్ తన పాటలకు ఒక ప్రత్యేకమైన హుక్ స్టెప్‌ను క్రియేట్ చేసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసేది. ఈ స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమె పాడిన పాటలు యూట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. 2023లో నికెన్ ఎన్నో అవార్డులు అందుకుంది. తాజాగా ఆ పాటలతో ఆమె మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భాష తెలియకపోయినా, సంగీతానికి సరిహద్దులు లేవని నిరూపిస్తూ ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది.
కొత్త పాటతో మళ్ళీ వచ్చేశారు 🤣🤣🤣 pic.twitter.com/QcIuqlwfgL
— Rambabu pasumarthi 🇮🇳 🇮🇳 (@pasumarthi66) May 26, 2025
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు