Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Its Official Rana Naidu Season 2 Streaming Date Fixed For June 13 On Netflix

Rana Naidu Season 2:  ‘రానా నాయుడు 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈ సారి అంతకుమించి

Rana Naidu Season 2:  ‘రానా నాయుడు 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈ సారి అంతకుమించి
  • Edited By: rocky,
  • Updated on May 20, 2025 / 07:12 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Rana Naidu Season 2: ఓటీటీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారు రెండేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ బాబాయ్-అబ్బాయ్‌లు వెంకటేశ్, రానా దగ్గుబాటిల కలయికతో భారీ అంచనాలతో వచ్చింది. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ సిరీస్ మొత్తం బూతులు, బోల్డ్ కంటెంట్‌తో నిండిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వెంకీ అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు ఇది షాక్ కలిగించింది. ‘వెంకీ మామ ఇలాంటి సిరీస్ చేయడమేంటి?’ అంటూ విమర్శలు వెల్లువెత్తినా, ఈ సిరీస్‌ను మాత్రం ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో ఒకటిగా ‘రానా నాయుడు’ నిలిచింది. మొదటి సీజన్‌కు వచ్చిన భారీ ఆదరణతో దీనికి కొనసాగింపు ఉంటుందని అప్పుడే నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడింది. ‘రానా నాయుడు’ సీజన్ 2 అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.

‘రానా నాయుడు’ మొదటి సీజన్ విడుదలైన తర్వాత, అందులోని అడల్ట్ కంటెంట్, బూతులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కుటుంబ హీరోగా పేరున్న వెంకటేశ్, అలాంటి పాత్రలో నటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ విమర్శల నేపథ్యంలో తొలి సీజన్‌పై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, రెండో సీజన్‌లో అలాంటి కంటెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉందని వెంకటేశ్ గతంలోనే హింట్ ఇచ్చారు. దీంతో కొత్త సీజన్ ఎలా ఉండబోతుందో, ఎలాంటి మార్పులు చేశారో తెలుసుకోవాలని ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also:Vishal : 15 ఏళ్ల స్నేహం.. పెళ్లిగా మారనున్న బంధం.. విశాల్, ధన్షిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?

Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️‍🔥
Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix.#RanaNaiduOnNetflix @VenkyMama @rampalarjun @krnx @Suparn @IncLocomotive @NetflixIndia pic.twitter.com/laB5Dv3hzE

— Rana Daggubati (@RanaDaggubati) May 20, 2025

‘రానా నాయుడు’ సీజన్ 2 కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో సిరీస్ స్ట్రీమింగ్ తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు. రానా దగ్గుబాటి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రానా నాయుడు’ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ టీజర్ కూడా ఇప్పటికే విడుదలై ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది.

Read Also:Jayam Ravi Divorce : కోర్టులో విడాకుల కేసు.. బయట సోషల్ మీడియా వార్.. ముదురుతున్న జయం రవి కుటుంబ వివాదం

‘రానా నాయుడు’ సీజన్ 2లో కూడా స్టార్ క్యాస్ట్ అలాగే కొనసాగనుంది. రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డీనో మోరియా వంటి ప్రముఖ నటులు కూడా ఈ సీజన్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ తారాగణం, ఉత్కంఠభరితమైన కథాంశంతో ‘రానా నాయుడు’ సీజన్ 2 మొదటి సీజన్ కంటే మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఇది ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Tag

  • Netflix India
  • Netflix Streaming Date
  • Rana Daggubati
  • Rana Naidu Release
  • Rana Naidu Season 2
Related News
  • Airtel Plans : ఎయిర్‌టెల్ 3 కొత్త ప్లాన్‌లు.. 25కు పైగా ఓటీటీ యాప్‌లు, బోలెడన్ని ప్రయోజనాలు!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us