Jayam Ravi Divorce : కోర్టులో విడాకుల కేసు.. బయట సోషల్ మీడియా వార్.. ముదురుతున్న జయం రవి కుటుంబ వివాదం

Jayam Ravi Divorce : కోలీవుడ్ నటుడు జయం రవి, ఆయన సతీమణి ఆర్తి రవి మధ్య విడాకుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఆర్తి రవి చేసిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కొత్త మలుపునిచ్చింది. తమ విడాకులకు ‘డబ్బు, అధికారం’ కారణం కాదని, ఓ ‘మూడో వ్యక్తే’ కారణమని దీనికి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆర్తి సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
జయం రవి, ఆర్తి రవి 2009లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది (2024) జయం రవి తాను భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, తనను సంప్రదించకుండానే ఆయన విడాకుల విషయం ప్రకటించారని ఆర్తి ఆరోపించారు. అప్పటినుంచి ఈ వివాదం కోర్టులో నడుస్తోంది.
Read Also:Vishal : 15 ఏళ్ల స్నేహం.. పెళ్లిగా మారనున్న బంధం.. విశాల్, ధన్షిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?
తాజాగా ఆర్తి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన మూడు పేజీల లేఖను విడుదల చేశారు. తమ బంధం విడిపోవడానికి ‘మూడో వ్యక్తే’ కారణమని స్పష్టం చేశారు. గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో జయం రవి రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే రూమర్స్ గత కొంతకాలంగా కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జయం రవి, కెనీషా కలిసి ఒక వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఆర్తి భావోద్వేగంతో స్పందిస్తూ, “మమ్మల్ని విడదీసింది మా మధ్య ఏదో కాదు – అది బయటి వ్యక్తి.. దీనికి నా దగ్గర ఆధారాలున్నాయి” అని పేర్కొన్నారు. విడాకుల పోరాటంలో ఇదే తన చివరి ప్రకటన అని కూడా ఆమె తెలిపారు.
ఆర్తి ఆరోపణలకు కౌంటర్‌గా జయం రవి కూడా సంచలన ఆరోపణలు చేస్తూ ఒక నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆర్తి తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్తి తల్లి కోట్లాది రూపాయల కోసం తనను షూరిటీగా ఒప్పందంపై సంతకం చేయించి మోసం చేశారని, ప్రస్తుత తన ఆర్థిక సమస్యలకు, ఒడిదుడుకులకు వారే కారణమని జయం రవి ఆరోపించారు. ప్రస్తుతం జయం రవి, ఆర్తి రవి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది. మధ్యవర్తిత్వ చర్చలు కూడా జరిగాయి. కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also:Vi BSNL : 20 కోట్ల మంది కస్టమర్లకు భారీ షాక్.. ఒక్కటి కాబోతున్న వోడాఫోన్-బీఎస్ఎన్ఎల్