India Vs England 3rd Test: మహ్మద్ సిరాజ్ బ్యాడ్ లక్.. భారత్ ఎలా ఓడిపోయిందంటే..
India Vs England 3rd Test చివరి వికెట్ గా మహ్మద్ సిరాజ్ అవుట్ కావడంతో టీమిండియా ఆశలకు బ్రేక్ పడింది. టీ బ్రేక్ తర్వాత బషీర్ వేసిన ఓవర్ లో సిరాజ్ ఐదో బంతిని బ్యాక్ ఫుట్ తో డిఫెన్స్ ఆడాడు.

India Vs England 3rd Test: లార్డ్స్ లో జరిగిన పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ పై ఓటమిపాలైంది. అయితే ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియాను దురదృష్టం వెంటడింది. అయితే 112 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కూడా జడేజా అద్భుతంగా పోరాడాడు. మరో ఎండ్ లో అతనికి బుమ్రా, సిరాజ్ కూడా అండగా నిలిచారు. అయితే చివరి వికెట్ గా మహ్మద్ సిరాజ్ అవుట్ కావడంతో టీమిండియా ఆశలకు బ్రేక్ పడింది. టీ బ్రేక్ తర్వాత బషీర్ వేసిన ఓవర్ లో సిరాజ్ ఐదో బంతిని బ్యాక్ ఫుట్ తో డిఫెన్స్ ఆడాడు.
కింద పడిన బంతి సిరాజ్ ఫ్యాడ్స్ పక్కనుంచి వెళ్లి లెగ్ స్టాంప్ ను తాకింది. అయితే సిరాజ్ గమనించేలోపే బెయిల్స్ కూడా కిందపడిపోయాయి. దీంతో సిరాజ్ దిగ్భ్రాంతి చెందాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల్ సంబరాలు చేసుకున్నారు. సిరాజ్ దురదృష్టవశాత్తూ అవుట్ కాకుండా ఉండుంటే ఫలితం మరోలా ఉండేదేమో అని అభిమానులు అంటున్నారు.
Test Cricket.
Wow.
😍 pic.twitter.com/XGDWM1xR2H— England Cricket (@englandcricket) July 14, 2025