Mad square trailer: లడ్డు గాని పెళ్లి ఆపేద్దాం.. నవ్వులు పూయిస్తున్న మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్

Mad square trailer: మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ అయితే అసలు మాములుగా లేదు. రెండు నిమిషాల ట్రైలర్ లో నవ్వులే నవ్వులు. కామెడీతో నిండిపోయింది. సినిమా మొత్తం లడ్డు గాని పెళ్లి గోల. లడ్డు గాని పెళ్లి ఆపేస్తాం అని డీడీ అంటుంటాడు. ఇక సినిమాకామెడీ తో అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ స్టోరీ మొత్తం లడ్డు గాని పెళ్లి జుట్టు తిరుగుతున్నట్లు తెలుస్తుంది.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ సినిమా వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చి.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఇరగదీసింది. ఏ సినిమాలో నితిన్, రామ్, శోభన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమా హిట్ కావడం పక్కా అనిపిస్తుంది. మ్యాడ్ మూవీ కామెడీనే తట్టుకోలేక పోయారు. పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. మ్యాడ్ స్క్వేర్ అంటే మరి మాములుగా లేదు. థియేటర్లో పక్కాగా నవ్వులు పుయిస్తుంది. ఇప్పటికే ఏ సినిమా నుంచి వచ్చిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా స్వాతి రెడ్డి పాట అయితే బాగా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా మొత్తం కామెడీ చూసి నవ్వుకోవాలంటే.. మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.
-
Anupama Parameswaran: అనుపమ డేటింగ్ చేసేది ఇతనితోనే.. వైరలవుతున్న ఫొటో
-
Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ
-
Mad Square: ఓవర్సీస్ లో మొదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ మేనియా..బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!
-
Allu Arjun-Trivikram Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. త్రివిక్రమ్, బన్నీ మూవీ ఎప్పుడో రివిల్ చేసిన నిర్మాత
-
Mad square teaser: మ్యాడ్ స్క్వేర్ టీజర్ నవ్వులే నవ్వులు.. టీజరే ఇలా ఉంటే.. ఇంకా సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో?