Mad Square: ఓవర్సీస్ లో మొదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ మేనియా..బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!

Mad Square:
గత రెండేళ్ల నుండి చిన్న సినిమాల మేనియా బాక్స్ ఆఫీస్ వద్ద మామూలు రేంజ్ లో లేదు. అనేక సూపర్ హిట్ చిన్న సినిమాలు పెద్ద హీరోల సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా అందుకు ఎన్నో ఉదాహరణలు చూసాము, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరో చిన్న సినిమాకు పెద్ద హీరోల సినిమాకు వచ్చేంత స్కోప్ ఉంది. అ సినిమానే ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie). 2023 లో విడుదలైన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. పోటీగా ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదలైతే డామినేట్ చేయగలదు, అంత సత్తా ఈ చిత్రానికి ఉంది. మార్చి 28 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టారు మేకర్స్.
నిన్న రాత్రి కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. కేవలం 130 షోస్ నుండి 8 వేలకు పైగా అమెరికన్ డాలర్స్ వచ్చాయట. ఇది చిన్న విషయం కాదు, కచ్చితంగా ఈ సినిమాకి వెయ్యి షోస్ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. ఈ వెయ్యి షోస్ నుండి 5 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. ట్రైలర్ విడుదల అయ్యాక అంచనాలు కూడా దాటేయొచ్చు, ఆ రేంజ్ లో ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాటని, టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండిటికి బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ అయితే యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. యూత్ ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే చాలు, బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్ వసూళ్లు వస్తాయి.
రీసెంట్ గా విడుదలైన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి కూడా ఆయా స్థాయి వసూళ్లను రాబట్టేంత స్టామినా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రిపోర్ట్స్ కూడా అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పొట్ట చెక్కలు అయ్యే రేంజ్ లో ఉంటుందట. కానీ సెకండ్ హాఫ్ గురించి ఇంకా క్లారిటీ గా ఎలాంటి సమాచారం రాలేదు. సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ ఉంటే మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మరి సినిమాలో అంత సత్తా ఉందా లేదా అనేది ట్రైలర్ తో సగం తెలిసిపోతుంది.