Mad square teaser: మ్యాడ్ స్క్వేర్ టీజర్ నవ్వులే నవ్వులు.. టీజరే ఇలా ఉంటే.. ఇంకా సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో?

Mad square teaser:
మ్యాడ్ స్క్వేర్ టీజర్‌ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ అయితే అసలు మాములుగా లేదు. రెండు నిమిషాల టీజర్‌లో నవ్వులే నవ్వులు. కామెడీతో నిండిపోయింది. లడ్డూగానితో టీజర్ స్టా్ర్ట్ అవుతుంది. స్వీట్ తినిపించే అమ్మాయి పేరు చెప్పు అంటే.. స్వీట్ పేరు చెప్తాడు. ఇక్కడి మంచి కామెడీ స్టార్ట్ అయింది. అన్నిటికంటే లాస్ట్ షాట్ అయితే హైలెట్. ఎందుకంటే.. కాల్ మాట్లాడుతూ హలో ఎవరు మీరు అని అడిగితే.. భాయ్ అని చెబితే.. బాయ్ అని సంగీత్ కాల్ కట్ చేస్తాడు. కేవలం రెండు నిమిషాల టీజర్ లోనే ఇంత కామెడీ ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ స్టోరీ మొత్తం లడ్డు గాని పెళ్లి జుట్టు తిరుగుతున్నట్లు తెలుస్తుంది. లడ్డుగానికి పెళ్లి కావడం,ఆ పెళ్లికి వెళ్లడం, అక్కడి నుంచి గోవాకి పోవడం ఇదే స్టోరీ. కానీ సినిమా మొత్తం కామెడీ పక్కా అన్నట్లుగా ఉంది.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ సినిమా వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చి.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఇరగదీసింది. ఏ సినిమాలో నితిన్, రామ్, శోభన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమా హిట్ కావడం పక్కా అనిపిస్తుంది. మ్యాడ్ మూవీ కామెడీనే తట్టుకోలేక పోయారు. పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. మ్యాడ్ స్క్వేర్ అంటే మరి మాములుగా లేదు. థియేటర్లో పక్కాగా నవ్వులు పుయిస్తుంది. ఇప్పటికే ఏ సినిమా నుంచి వచ్చిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా స్వాతి రెడ్డి పాట అయితే బాగా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా మొత్తం కామెడీ చూసి నవ్వుకోవాలంటే.. మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.
Fully energetic and comedy teaser of (MAD) 2 🔥💥🤩
out now ⬇️ pic.twitter.com/gkfwveBQRY— TFI Reveals 🎬📢🔥 (@vishnu_vk6) February 25, 2025