Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి టాలీవుడ్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయరు.. దీనికి గల కారణం ఏంటి?

Venky Atluri:
టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాల విజయాలతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ఒక మార్క్‌ను తెచ్చుకున్నాడు. వెంకీ అట్లూరి తెలుగులో తొలిప్రేమ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. చాలా మందికి ఈ తొలి ప్రేమ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత మిస్టర్ మజ్ను (Mr. Majnu) అక్కినేని అఖిల్ (Akhil Akkineni)తో చేశారు. అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయితే కాలేదు. నిజానికి అఖిల్ కెరీర్‌కి కూడా ఉపయోగపడలేదు. ఆ తర్వాత నితిన్‌తో (Nithin Kumar) రంగ్ దే చేశారు. ఇది కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దీంతో వెంకీ అట్లూరి తన రూట్‌ను మార్చుకున్నాడు. టాలీవుడ్ హీరోలను పక్కన పెట్టి కోలీవుడ్, మాలీవుడ్ హీరోలపై కాస్త ఫోకస్ పెట్టాడు. దీంతో వెంటనే ధనుష్‌తో (Dhanush) సార్ మూవీ (Sir) తీశాడు. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని ఇచ్చింది. తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఆ తర్వాత మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) లక్కీ భాస్కర్ (Lucky Baskhar)ని ఇటీవల తీశారు. ఇది కూడా మంచి కాన్సెప్ట్‌తో హిట్ కొట్టింది. కలెక్షన్లతో పాటు వెంకీకి మంచి పేరును తీసుకొచ్చింది.
వెంకీ అట్లూరి ఇప్పుడు మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్యతో (Surya) సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా తెలుగు హీరోలతో కాకుండా మిగతా భాషల హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. ఇలా వెంకీ సినిమాలు చేయడంతో హిట్ కావడంతో పాటు మంచి బిజినెస్ కూడా జరుగుతోంది. కేవలం తెలుగు హీరోలతో చేస్తే కేవలం తెలుగు వరకు మాత్రమే ఉంటుంది. అదే మిగతా భాషల్లో చేస్తే మాత్రం అన్నింట్లో కూడా మంచి బిజినెస్ జరుగుతుందనే ఉద్దేశంతోనే వెంకీ అట్లూరి ఇలా సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల కలెక్షన్లతో పాటు బాగా ఫేమ్ కూడా వస్తుంది. అలాగే తన కథకు కూడా సరైన హీరో కూడా సెట్ కావడం లేదని అందుకే వేరే భాషల్లో హీరోలతో చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తెలుగు హీరోలతో చేసిన సినిమాల కంటే ఇతర భాషల హీరోలతో చేసిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇవి తెలుగులో కూడా బాగా హిట్ అయ్యాయి. అయితే ఇకపై చేసే సినిమాలో అయినా వెంకీ తెలుగు హీరోని ఎంచుకుంటాడో లేదో చూడాలి.