Balayya Rejected Laya: షూటింగ్ మొదటి రోజే లయను వద్దు అనేసిన బాలయ్య.. విషయాలు బయటపెట్టిన లయ
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో లయ ఒకరు. ఈమె అందానికి, నటనకి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో ఈమె సినిమాలు చూడటానికి కోసం చాలా మంది రిలీజ్ రోజు థియేటర్‌కు వెళ్లేవారు. అయితే లయ అప్పట్లో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. లయ కెరీర్ మంచి స్టేజ్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంది.

Balayya Rejected Laya: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో లయ ఒకరు. ఈమె అందానికి, నటనకి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో ఈమె సినిమాలు చూడటానికి కోసం చాలా మంది రిలీజ్ రోజు థియేటర్‌కు వెళ్లేవారు. అయితే లయ అప్పట్లో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. లయ కెరీర్ మంచి స్టేజ్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత లయ మళ్లీ సినిమాలు చేయలేదు. పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 1999లో వేణు ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి 2006 వరకు వరుస సినిమాల్లో నటించింది. లయ దాదాపుగా ఒక 40 సినిమాల్లో నటించి ఉంటుంది. వీటిలో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సమయంలో గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని లయ అమెరికాకు వెళ్లి పోయింది. హీరోయిన్లు ఆలస్యంగా పెళ్లి చేసుంటారు. కానీ లయ మాత్రం 25 ఏళ్లకే పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే ఐటీ జాబ్ చేసి డ్యాన్స్ స్కూల్ నడిపించేంది. అయితే ఇటీవల లయ అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇండియాకు వచ్చిన తర్వాత ఆమె కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను పంచుకుంది.
Read Also: కళ్ల ముందే అలా చేసే సరికి.. లైవ్‌లో ఎమోషనల్ అయిన అమర్‌దీప్
విజయేంద్ర వర్మ సినిమాలో లయ నందమూరి బాలకృష్ణతో కలిసి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను లయ పంచుకున్నారు. విజయేంద్ర వర్మ సినిమా షూటింగ్ సమయంలో ఒక పాట రిహార్సల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో బాలయ్య, లయ కలిసి డ్యాన్స్ చేస్తుంటే.. చూసుకోకుండా బాలయ్య కాలును లయ తొక్కేసింది. దీంతో క్షమించండి సార్, చూసుకోకుండా కాలు తొక్కేసానని లయ బాలయ్యతో చెప్పారు. అప్పుడు దానికి బాలయ్య స్పందిస్తూ.. షూటింగ్ ఫస్ట్ డేనే నా కాలు తొక్కేస్తావా? షూటింగ్ లేదు, ఏమి లేదు, ప్యాకప్.. ఇక ఈ అమ్మాయిని తీసేయండని అన్నారని లయ తెలిపింది. ఈ సమయంలో నిజంగానే తీసేస్తారని భయం వేసింది. బాలయ్య నిజంగానే ఫీల్ అయ్యారు ఏమోనని పక్కకి వెళ్లి ఆమె ఏడ్చారు. ఇంతలో బాలయ్య మళ్లీ వచ్చి సరదాగా అన్నాను.. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని తెలిపారని లయ వెల్లడించింది.
Read Also: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
తెలుగులో లయ మంచి సినిమాలు చేసింది. ఇవన్నీ కూడా కమర్షియల్ హిట్ అయ్యాయి. స్టార్ హీరోయిన్‌గా లయ తన కెరీర్‌ను మంచిగా కొనసాగించింది. ఈ సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాకు గుడ్ బై చెప్పింది. లయ సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేసింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇండియా వచ్చింది. నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రాబోతున్న తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన లుక్‌ను కూడా మూవీ టీం విడుదల చేసింది. అలాగే జబర్దస్ షోకి జడ్జ్‌గా కూడా లయ వ్యవహరిస్తోంది. అయితే లయ కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని భావిస్తోందని అందుకే ఇండియా వచ్చిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.