Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Balayya Akhanda 2 Teaser Out Now

Balayya Akhanda 2 teaser: వచ్చేసిన అఖండ 2 టీజర్.. డ్యుయల్స్ లుక్స్‌లో బాలయ్య బాబు అరాచకం

Balayya Akhanda 2 teaser: వచ్చేసిన అఖండ 2 టీజర్.. డ్యుయల్స్ లుక్స్‌లో బాలయ్య బాబు అరాచకం
  • Edited By: kusuma,
  • Updated on June 9, 2025 / 06:34 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Balayya Akhanda 2 teaser: డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబోలో వస్తున్న అఖండ-2 మూవీ టీజర్ వచ్చేసింది. బాలయ్య పుట్టిన రోజు జూన్ 10వ తేదీన కావడంతో కొన్ని గంటల ముందు మూవీ టీం టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచే హైప్ ఉంది. టీజర్‌తో సినిమాలపై అంచనాలు ఇంకా పెరిగాయి. డ్యుయల్ రోల్‌లో బాలయ్య బాబు యాక్టింగ్, బీజీఎం ఇంకా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండకి సీక్వెల్‌‌గా వస్తున్న ఈ మూవీ టీజర్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. బాలయ్య బాబు అయితే ఊర మాస్ లుక్‌లో కోపంతో అదిరిపోయాడు.

బాలయ్య నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అదే టీజర్‌లో కనిపిస్తోంది. అయితే అఖండ మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో సీక్వెల్‌గా పార్ట్-2ను తీస్తున్నారు. ఇటీవల జార్జియాలో షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా కాస్త షూటింగ్ మాత్రమే ఉంది. ఈ మూవీని ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. టీజర్‌లో డైలాగ్‌లు కూడా అదిరిపోయాయి. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కూడ కన్నెతి చూడడు.. నువ్వు చూస్తావా? ‘అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌లు టీజర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఇవి ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా మూవీ టీం చెప్పిన సమయానికే టీజర్‌ను విడుదల చేసింది.

మొత్తానికి టీజర్ అయితే పీక్స్‌లో ఉంది. మరి అఖండ 2 సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తప్పకుండా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకి థియేటర్లలో పూనకాలే వస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య వరుస సినిమాలతో హిట్‌లు కొడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా అయితే సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి సందర్భంగా కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. సంక్రాంతి సమయంలో వారం రోజుల పాటు థియేటర్లు అయితే నిండిపోయాయి.

ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Tag

  • Akhanda 2 teaser
  • Balayya
  • Boyapati Srinu
  • Samyuktha Menon
  • Taman
Related News
  • Balayya Rejected Laya: షూటింగ్ మొదటి రోజే లయను వద్దు అనేసిన బాలయ్య.. విషయాలు బయటపెట్టిన లయ

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us