Puri Jagannadh : హిట్ కోసం కసిగా ఉన్న పూరీ.. విజయ్ సేతుపతితో అయినా హిట్టు కొట్టేనా ?

Puri Jagannadh : టాలీవుడ్లో పూరీ జగన్నాథ్ ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆయనలా వరుస హిట్‌లు ఇచ్చిన దర్శకులు తెలుగులో మరొకరు లేరనే చెప్పాలి. రాజమౌళి కంటే కూడా పూరీ జగన్నాథ్ టాలెంటెడ్ దర్శకుడు అని రాజమౌళి తండ్రే మెచ్చుకున్న సందర్భాలున్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పూరీ జగన్నాథ్ అదృష్టం సరిగా లేదు. ఆయన తీసిన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం తాను ఒక హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఒక కొత్త సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాను ఆయనే నిర్మిస్తున్నారు.
Read Also:Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!
పూరీ జగన్నాథ్ తన కొత్త సినిమాకు హీరోగా విజయ్ సేతుపతిని తీసుకున్నారు. విజయ్ సేతుపతి మాత్రమే కాదు, చాలా మంది టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లోనే షూటింగ్ కూడా మొదలైంది.పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ కింద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జేబీ నారాయణ్ రావు కొండ్రోల్ల , జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌తో కలిసి ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ మరికొందరు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దునియా విజయ్, టబు ఇతర నటీనటులు కొద్దిగా ఆలస్యంగా షూటింగ్‌లో చేరనున్నారు. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ కసిగా ఉన్నారు.
25 సంవత్సరాలుగా సినిమాలు డైరెక్ట్ చేస్తున్న తెలుగులో బద్రి, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, బుజ్జిగాడు, అమితాబ్ బచ్చన్ నటించిన బుడ్డా హోగా తేరా బాప్, టెంపర్ ఇంకా చాలా సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేశారు.పూరీ జగన్నాథ్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ నటించిన అప్పు, శివరాజ్‌కుమార్ నటించిన యువరాజ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. కానీ 2022లో విడుదలైన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా హిట్ కాలేదు. ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి కొత్త సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు.