Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!

Hero Nithin :
ట్విట్టర్ లో రీసెంట్ గానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో తయారు చేయబడిన ‘గ్రోక్'(Grok) అనే ఫీచర్ నెటిజెన్స్ కి తెగ నచ్చేసింది. ఈ ఫెచర్ తో నెటిజెన్స్ ప్రతీ రోజు ఆడుకుంటున్నారు. గ్రోక్ అని ట్యాగ్ చేసి ఏదైనా అడిగితే, అటు వైపు నుండి సమాధానం అదిరిపోయే రేంజ్ లో వస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్రోక్ బూతులు కూడా తిట్టేస్తుంది. పాపం హీరో నితిన్ కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నితిన్(Hero Nithin) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) ఈ నెల 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అభిమానులు ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక అభిమాని గ్రోక్ ని ట్యాగ్ చేసి ట్రైలర్ విడుదల తేదీ, సమయాన్ని అడగగా, దానికి గ్రోక్ సమాధానం చెప్పింది.
ఇంతకీ ఆ సమాధానం ఏమిటంటే ‘వెంకీ కుడుముల గారు, ట్రైలర్ విడుదల సమయం ఖరారు అయ్యింది. మార్చి 21 న, సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతుంది. మార్చి 28న థియేటర్స్ లోకి రాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి డైరెక్టర్ వెంకీ కుడుముల స్పందిస్తూ ‘మీరు సూపర్ అండీ గ్రోక్ గారు. నితిన్ గారు నాకెందుకో గ్రోక్ గారిని మళ్ళీ గోకాలని అనిపిస్తుంది’ అని అంటాడు.
అప్పుడు నితిన్ దానికి సమాధానం ఇస్తూ ‘అయితే వెంటనే నీ గోర్లు కట్ చేస్కో..అంతే కానీ గ్రోక్ గారితో కామెడీ వద్దు’ అని అంటుంది. అప్పుడు ఒక అభిమాని గ్రోక్ గారు, ఇక్కడ ఎదో అంటున్నారు చూడండి అని అడగగా, దానికి గ్రోక్ సమాధానం ఇస్తూ ‘ట్రైలర్ విడుదల సమయం అడిగారు, చెప్పాను, దానికి కామెడీ చేస్తే గూబ పగులుద్ది’ అంటూ సమాధానం ఇస్తుంది. ఈ రిప్లై ట్విట్టర్ మొత్తం వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ పగలబడి నవ్వుకున్నారు.
ఇక రాబిన్ హుడ్ విషయానికి వస్తే, ‘భీష్మ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ మరోసారి వెంకీ కుడుముల తో కలిసి చేస్తున్న చిత్రమిది. టీజర్, పాటలు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు కానీ, సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ అయితే బలంగా ఉంది. నితిన్ ఈ సినిమా ఔట్పుట్ పై చాలా నమ్మకం తో ఉన్నాడు. అదే విధంగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ సినిమా హిట్ కాకుంటే నా పేరు మార్చేసుకుంటా లాంటి భారీ డైలాగ్ కొట్టాడు. వీళ్లందరి నమ్మకం చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొట్టేలా అనిపిస్తుంది. ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?