Stress: ఒత్తిడి చంపేస్తుందా.. అయితే ఇలా బయటపడండి

Stress: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కోరుకోవడం, ఆ పని జరగకపోతే వెంటనే ఆందోళన, ఒత్తిడికి గురవుతారు. చదువు, ఉద్యోగం, పెళ్లి, వ్యక్తిగత సమస్యలు ఇలా అన్నింట్లో కూడా సమస్యలు ఉంటున్నాయి. కొందరు ఈ సమస్యలను లైట్ తీసుకుంటే మరికొందరు ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరు అయితే ఒత్తిడితో చాలా బాధ అనుభవిస్తారు. ఎల్లప్పుడూ కూడా అవే ఆలోచనలు, భయం, బాధ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి విముక్తి పొందడానికి ఎన్నో విధాలుగా కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఒత్తిడి నుంచి బయటపడటం లేదు. కొందరు ఈ ఒత్తిడిని జయించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి:Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!
ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి ముఖ్యమైన మార్గం మెడిటేషన్, యోగా. కొందరికి కాస్త సమయం ఫ్రీ దొరికినా సరే ఏదో ఒక విషయం కోసం అతిగా ఆలోచిస్తుంటారు. అలాంటి వారు సమయం దొరికిన ప్రతీ సారి కూడా యోగా లేదా ధ్యానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం అనేది ఎలాంటి ఆలోచనలు మనస్సులోకి రానివ్వకుండా రోజులో ఎక్కువ సమయం చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ప్రతీ విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ కారు. కొందరు ప్రతీ చిన్ని విషయానికి భయపడుతుంటారు. అదే ధ్యానం చేస్తే ఆందోళన ఉండదు. ఎలాంటి సమస్యను అయినా కూడా సునాయాసంగా బయటపడగలరు. రోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి యోగా లేదా మెడిటేషన్ చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కళ్లు మూసుకుని, శ్వాస వదులుతూ లోతుగా మెడిటేషన్ చేస్తే మాత్రం తప్పకుండా ఒత్తిడి నుంచి బయటకు వస్తారు.
ఇది కూడా చూడండి:Instagram: ఈ 5 టిప్స్ తో సైబర్ దాడుల నుంచి మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సేఫ్ గా ఉంచుకోండి
యోగా, మెడిటేషన్ చేయడం వల్ల కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా మానసిక, శారీరక సమస్యలు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. శారీరంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వయస్సు పెరిగినా కూడా ఫిట్‌గా ఉంటారు. మెడిటేషన్, యోగా చేయడం వల్ల తొందరగా ముసలితనం రాదు. వయస్సు పెరిగినా కూడా చిన్న వయస్సులుగా ఉంటారు. యంగ్ లుక్‌లో ఆరోగ్యంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Stress relief: అందంగా ఉండాలంటే చిట్కాలే కాదు.. ఒత్తిడిని కూడా జయించాల్సిందే
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?
-
Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
-
Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
-
premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ