Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..

Tollywood Heroine :
చాలామంది హీరోయిన్లు తొలి సినిమాతోనే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతారు. తమ మొదటి సినిమాతోనే ఎప్పటికీ గుర్తుండిపోయే క్రేజ్ ను సొంతం చేసుకుంటారు సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు, రేర్ ఫోటోలు అలాగే వీడియోలను చూడడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తారు. ఇటువంటి ఫోటోలకు సామాజిక మాధ్యమాల్లో బాగా రీచ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోయిన్ల అరుదైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే ఆ ఫోటోలలో ఉన్న హీరోయిన్లను గుర్తుపట్టడానికి కూడా అందరూ చాలా ఆసక్తిని చూపిస్తారు. అలాగే అభిమానులు తమకు ఇష్టమైన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు దగ్గర నుంచి వాళ్ల రీసెంట్ ఫోటోల వరకు అన్నీ కూడా చాలా భద్రంగా దాచుకుంటారు. తమ సోషల్ మీడియా ఖాతాలలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రస్తుతం ఒక తెలుగు హీరోయిన్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగుతోపాటు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా తమిళ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా పలు హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. నటనపరంగా ఈమె ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు రెండు జడలు వేసుకుని పెద్ద కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు తెలుగు హీరోయిన్ అంజలి. తమిళ్లో రిలీజ్ అయిన షాపింగ్ మాల్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది అంజలి. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అంజలి జర్నీ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. తెలుగులో అసలు సినిమాలలో నటించి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.
ఈ క్రమంలో ఆమె కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించింది. సూర్య సింగం 2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంది. అంజలి తెలుగులో మరియు తమిళ్ లో కూడా నటిస్తుంది. తాజాగా ఈమె డిజిటల్ వరల్డ్ లో అడుగు పెట్టింది. ఓటీటీ లో పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరగా అంజలి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది
View this post on Instagram
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Viral Photo : ఈ బుడ్డోడు ఎవరో చెప్పగలరా.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా బాగా ఫేమస్..
-
Viral Photo : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈమె అందానికి కుర్రాళ్ళ మతి పోవాల్సిందే…లేటెస్ట్ ఫోటోలు వైరల్..
-
Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…