Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Court Movie:

Court Movie : కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14వ తేదీన రిలీజ్ అయ్యింది. హర్ష్ రోహణ్, శ్రీదేవి కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఓటీటీలో ఐదు భాషల్లోకి ఈ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానున్నట్లు తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడంతో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ.9 కోట్లతో తీసిన ఈ సినిమా మొదటి రోజే రూ.8 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మొత్తం మీద సినిమా రూ.57 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రోషన్, శ్రీదేవి యాక్టింగ్ బాగుందని ప్రియదర్శి జీవించేశారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం కూడా సూపర్‌గా ఉంది. దీంతో సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో శివాజీ మంగపతిగా నటించారు. ఇతని నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
కోర్ట్ బ్యాక్ డ్రాప్ అంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఈ క్రమంలో ఓ ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా చేస్తుండగా ఒక పెద్ద ఇంటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఆ అమ్మాయి తండ్రి పరువు, ప్రతిష్టలే ప్రాణంగా భావిస్తాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుంది. దీంతో అమ్మాయి మామయ్య యువకుడిపై కేసులు పెడతాడు. ఎంతో కఠినమైన పోక్సో యాక్ట్‌తో పాటు మరికొన్ని కేసులు కూడా పెడతాడు. ఆ యువకుడిని జైలులో పెట్టిస్తాడు. ఈ సమయంలో ఆ యువకుడి కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. అప్పుడు ప్రియదర్శి ఆ కేసును తీసుకుంటారు. ఆ యువకుడి తరఫున కేసు వాదిస్తాడు. అయితే ఈ సినిమాలో ఆ యువకుడికి న్యాయం జరిగిందా? లాయర్ ఏ విధంగా వాదించాడు? ఎలా ఈ కేసు నుంచి బయటపడ్డాడనేది స్టోరీ.
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Sridevi : చేసింది ఒక్క సినిమానే.. కొత్త కారు కొన్న జాబిలి.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే ?
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?