Baahubali : బాహుబలి రీ యూనియన్లో అనుష్క, తమన్నా కనిపించలేదు.. అందుకే రాలేదా ?

Baahubali : భారత సినిమా గమనాన్నే మార్చిన చిత్రం బాహుబలి. ఈ సినిమా భారతీయ సినీ రంగాన్ని ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేసింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి, భారీ వసూళ్లను సాధించవచ్చని నిరూపించింది. అంతేకాదు, భారతీయ పౌరాణిక కథలకు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే సత్తా ఉందని చూపించింది. ఎన్నో రికార్డులు బాహుబలి పేరు మీద ఉన్నాయి. అలాంటి అద్భుతమైన సినిమా విడుదలై నిన్నటికి (జూలై 10) పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ‘బాహుబలి: ది బిగినింగ్’ టీమ్ ఒక రీ-యూనియన్ ఏర్పాటు చేసింది.
బాహుబలి: ది బిగినింగ్ సినిమా 2015, జూలై 10న విడుదలైంది. ఈ పదేళ్ల మైలురాయిని పురస్కరించుకొని బాహుబలి టీమ్ ఒక స్పెషల్ రీ-యూనియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సినిమా కోసం పనిచేసిన చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా ఒకచోట చేరి సినిమా విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాహుబలి షూటింగ్ రోజులు, విడుదల సమయం నాటి ఎన్నో జ్ఞాపకాలను వారు మళ్ళీ నెమరువేసుకున్నారు.
ఈ రీ-యూనియన్‌లో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, నిర్మాత శోభు యార్లగడ్డ, కెమెరామెన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్లు సాబు సిరిల్, విజయ్ ప్రకాష్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, పబ్లిసిటీ ఇంచార్జ్ కార్తికేయ ఇంకెంతో మంది పాల్గొన్నారు. ఈ రీ-యూనియన్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అయితే రీ-యూనియన్ ఫోటోలలో అనుష్క శెట్టి, తమన్నా భాటియా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాహుబలి సినిమా విజయానికి ఈ ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వీళ్లిద్దరూ ఈ సంబరాల్లో ఎందుకు కనిపించలేదు? అసలు వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు విషయం అది కాదని తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తమన్నా, అనుష్క శెట్టి ఇద్దరికీ ఆహ్వానాలు అందాయట. కానీ, వారు వేర్వేరు కారణాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది.
Read Also:Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
తమన్నా భాటియా ప్రస్తుతం ఏదో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున రాలేకపోయారట. ఇక అనుష్క శెట్టి విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం ఘాటి అనే సినిమా కోసం చాలా బరువు తగ్గి, పూర్తిగా భిన్నమైన లుక్‌లో ఉన్నారట. తన కొత్త లుక్‌ను రివీల్ చేయడానికి ఇష్టపడనందున ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది. అంతేకాదు, ఘాటి సినిమా టీమ్‌కు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారట. ఘాటి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా తాను హాజరు కాబోనని, కేవలం సెలక్ట్ చేసిన కొన్ని కార్యక్రమాలకు మాత్రమే వస్తానని అనుష్క చెప్పినట్లు సమాచారం.
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!
-
SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో
-
Tamannaah Bhatia-Vijay Varma: తమన్నాకి బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ రొమాన్స్.. ప్రైవేట్ వీడియో లీక్
-
Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో
-
Anushka Shetty : అనుష్క ఒకే ఒక్క ఫోటో చూస్తూ 40 యాక్సిడెంట్లు.. ఇంతకీ ఏంటా సినిమా ?
-
SSMB 29: మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. SSMB మూవీ కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదట