Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో

Prabhas : మన సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటున్నారు. కొందరు 40 ఏళ్లు దాటితే, మరికొందరు 50, 60 ఏళ్లు దాటినవాళ్లు కూడా ఉన్నారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, టబు, తుషార్ కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ ఖన్నా, ఆశా పరేఖ్, కరణ్ జోహార్ వంటి పెద్ద పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇంకా సింగిల్‌గానే ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 45 ఏళ్లు వచ్చినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.
‘బాహుబలి’ తర్వాత పెళ్లి ప్రపోజల్స్ సునామీ
ప్రభాస్‌కు 45 ఏళ్లొచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉన్నారు. కానీ, మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. దాదాపు పదేళ్ల క్రితం ఆయనకు 6 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన ‘బాహుబలి’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పెళ్లి ప్రపోజల్స్ సునామీలా వచ్చి పడ్డాయి. ఈ సినిమాతో ప్రభాస్‌కు అంత పేరు వచ్చింది మరి. అమ్మాయిలు ఆయనకు అభిమానులుగా మారి, ఆయనను పెళ్లి చేసుకోవాలని కలలు కనడం మొదలుపెట్టారు.
ప్రభాస్ జీవితాన్ని మార్చేసిన ‘బాహుబలి’
ప్రభాస్ తన సినీ కెరీర్‌ను 2002లో వచ్చిన ‘ఈశ్వర్’ సినిమాతో మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించారు. అయితే, ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సౌత్‌లోనే కాదు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్‌కు 6 వేల పెళ్లి ప్రపోజల్స్
‘బాహుబలి’ విజయం ప్రభాస్‌ను టాప్ స్టార్ గా చేసింది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ప్రజలు ఆయనను గుర్తించడం మొదలుపెట్టారు. ఆయనకు మహిళా ప్రేక్షకులు ఆయనంటే పడి చచ్చిపోయారు. ఈ సినిమాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2015లో వచ్చిన ఈ సినిమా తర్వాత, దేశం నలుమూలల నుంచి ప్రభాస్‌కు 6 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అయితే, ఆయన మాత్రం ఏ ఒక్కదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెళ్లి ముచ్చట లేదు.
Read Also:Viral Video : మిస్ అయితే యముడికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.. లారీ కింద పడకేంట్రా బాబు
2012లోనే జరగాల్సిన పెళ్లి
ప్రభాస్ పెళ్లి 2012లోనే జరిగే అవకాశం ఉండేది. ఎందుకంటే, అప్పుడు ఆయన తల్లి ఆయనకు పెళ్లి చేయాలని పట్టుబట్టింది. అప్పుడు ప్రభాస్ కూడా పెళ్లికి సరే అన్నాడు. ఆయన తల్లి పెళ్లి సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టింది. కానీ, ఇంతలో ఒక రోజు ప్రభాస్‌కు రాజమౌళి నుండి కాల్ వచ్చింది. ఆయన ‘బాహుబలి’ కథను ప్రభాస్‌కు వినిపించారు. ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పగానే డైరెక్టర్ ‘బాహుబలి’,’బాహుబలి 2′ కోసం 5 సంవత్సరాల సమయం అడిగారు. ప్రభాస్ ఆయన డిమాండ్‌ను కూడా ఒప్పుకుని తన పెళ్లి ప్లాన్‌ను వాయిదా వేసుకున్నాడు.
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali : బాహుబలి రీ యూనియన్‌లో అనుష్క, తమన్నా కనిపించలేదు.. అందుకే రాలేదా ?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు