SSMB 29: మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. SSMB మూవీ కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదట

SSMB 29:
ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో SSMB29 ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా చర్చ జరుగుతోంది. సినిమా నుంచి మొదటి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించి ఓ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. షూటింగ్ ప్రారంభం అయినట్లు మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే అందరూ కూడా ఈ సినిమా అడ్వెంచర్ అని అనుకుంటున్నారు. తీరా షూటింగ్ క్లిప్ వైరల్ అయ్యే సరికి ఇది అడ్వెంచర్ డ్రామా కాదేమోనని అనుమానాలు వస్తున్నాయి.
ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన క్లిప్ చూస్తే మిస్టరీ తప్ప ఏం లేదు. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కూర్చొంటే.. మహేష్ బాబు ఓ స్టైలిష్ కుర్చీలో కూర్చుంటాడు. మషేష్‌ను ఆర్మీ అధికారి ముందుకు నెట్టుతాడు. ఇలాంటి సీన్లు గతంలోఎక్స్-మెన్ ఫ్రాంచైజీలో ఉండటంతో పాటు కొన్ని హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కూడా ఉంది. దీనివల్ల ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ అంశాలు ఉంటాయనే వార్తలు జోరుగా వస్తున్నాయి. నిజానికి రాజమౌళి సినిమాల్లో కొత్తదనం, అడ్వెంచర్ ఉంటాయి. వీటితో పాటు ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా అమెజాన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ షూట్ వీడియో లీక్ విధంగా చూసుకుంటే సినిమా వేరేలా ఉంది. ఇది నిజమైతే మాత్రం అభిమానులకు సర్‌ప్రైజింగ్ అని చెప్పవచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం మూవీ టీం స్పందించాల్సిందే.
ఇదిలా ఉండగా ఇటీవల సినిమా షూటింగ్ క్లిప్ లీక్ అయ్యింది. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షూటింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని సందేహాలు మొదలవుతున్నాయి. నిజానికి రాజమౌళి సినిమాల షూటింగ్ సిన్ లీక్లు పెద్దగా జరగవు. అందులోనూ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఇలా జరిగింది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2027లో విడుదల కానున్నట్లు సమాచారం.