Anushka Shetty : అనుష్క ఒకే ఒక్క ఫోటో చూస్తూ 40 యాక్సిడెంట్లు.. ఇంతకీ ఏంటా సినిమా ?

Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ఒకప్పుడు ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు తమ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా తమ నటనతో, అందంతో, వ్యక్తిత్వంతో భారీ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అనుష్క శెట్టి సినిమాల్లో నటించడం తగ్గించినా ఒకప్పుడు సంవత్సరానికి పదుల కొద్దీ సినిమాల్లో నటించేవారు. అయితే, అనుష్క శెట్టి ఒక చిత్రం వల్ల ఏకంగా 40 ప్రమాదాలు జరిగాయని మీకు తెలుసా ? ఆ సినిమా ఏది? ప్రమాదాలు ఎందుకు జరిగాయి? వివరంగా తెలుసుకుందాం.
‘వేదం’ సినిమా పోస్టర్‌తో పంజాగుట్ట సర్కిల్‌లో సంచలనం
సుమారు 15 సంవత్సరాల క్రితం అనుష్క శెట్టి ‘వేదం’ అనే తెలుగు సినిమాలో నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఒక ఆంథాలజీ (anthology) సినిమా. ఒకదానికొకటి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథలను ఈ సినిమా కలిగి ఉంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి మొదటిసారిగా వేశ్య పాత్రలో నటించారు. సినిమా విడుదల కావడానికి ముందు ప్రచారం కోసం ఆమె పోస్టర్‌లను హైదరాబాద్‌లోని అనేక చోట్ల ఏర్పాటు చేశారు.
Read Also:Prabhas :’ది రాజా సాబ్’ కోసం రూ.50కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్ ? అసలు కారణం ఇదే!
హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద పసుపు రంగు చీరలో ఉన్న అనుష్క భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్ ఎంత ఆకర్షణీయంగా ఉందంటే, ఆ పోస్టర్‌ను చూసుకుంటూ వాహనాలు నడుపుతూ చాలా ప్రమాదాలు జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, కేవలం కొన్ని రోజుల్లోనే పంజాగుట్ట సర్కిల్‌లో ఏకంగా 40 ప్రమాదాలు జరిగాయి. ఈ వరుస ప్రమాదాలను గమనించిన హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ మున్సిపల్ అధికారులకు (GHMC) విన్నవించుకుని, చివరికి పంజాగుట్ట సర్కిల్ నుంచి అనుష్క శెట్టి పోస్టర్‌ను తొలగించాల్సి వచ్చింది.
‘వేదం’ ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్!
‘వేదం’ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోని అద్భుతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సినిమాలో అనుష్క శెట్టి వేశ్య పాత్రలో నటించారు. తన వేశ్యా గృహం నుంచి తప్పించుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఆమె లక్ష్యం. అల్లు అర్జున్, త్వరగా ధనవంతుడు కావాలని కలలు కంటూ ఒక ధనిక యువతిని ప్రేమించిన యువకుడి పాత్రలో నటించారు. నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఒక ముస్లిం వ్యక్తి పాత్రలో, మంచు మనోజ్ బాధ్యత లేని సంగీతకారుడి పాత్రలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి (జూలై 4) 15 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Read Also:Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Krish Sensational Tweet On Harihara Veeramallu: మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. సంచలన ట్వీట్ వైరల్
-
Baahubali : బాహుబలి రీ యూనియన్లో అనుష్క, తమన్నా కనిపించలేదు.. అందుకే రాలేదా ?
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు