Relationship Tips: మీకు భాగస్వామి ఉందని గుర్తించండి.. మరిచిపోయారా ఇక పెంటే!

Relationship Status: భార్యాభర్తలు మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలంటే ఇద్దరూ కూడా తప్పకుండా కొన్ని నియామలు పాటించాలి. లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో చాలా మంది కనీసం పార్ట్‌నర్‌ను పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఎక్కువగా గొడవలు అయి విడిపోతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి నియామాలు పాటించకపోవడం వల్ల చాలా మంది విడిపోతున్నారు. భార్యాభర్తల మధ్య హ్యాపీ ఉండాలంటే తప్పకుండా ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉండాలి. అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రతీ ఒక్కరికి బిజీ పనులు ఉంటాయి. అయితే ఎంత బిజీగా ఉన్న కూడా కొంత సమయం వారి పక్కన కూర్చోని మాట్లాడండి. ఇద్దరూ కలిసి సరదాగా ఉండటం వల్ల వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎంత పెద్ద గొడవ అయినా కూడా ఒక పది నిమిషాల పాటు కూర్చోని మాట్లాడితే సరిపోతుంది. ఎంత పెద్ద కోపం అయినా కూడా ఇట్టే తీరిపోతుంది. ఆఫీసులో బిజీగా ఉన్నా కూడా తిన్నావా లేదా అని అడగాలి. అలాగే ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక దగ్గర కూర్చోని ఉండాలి. ఆఫీసులో ఏం జరిగిందనే అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలి. దీనివల్ల ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఎలాంటి మనస్పర్థలు కూడా ఉండవు. అన్ని విధాలుగా కూడా హ్యాపీ ఉంటారు. ఏవైనా మనస్పర్థలు వచ్చినా కూడా క్లియర్ అయిపోతాయి. ఒకరి మీద ఒకరికి గౌరవంతో పాటు అర్థం చేసుకునే గుణం కూడా పెరుగుతుంది.
కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సపోర్ట్‌గా ఉండాలి. వీటివల్ల ఆ సమస్య ఎంత పెద్దగా ఉన్నా కూడా చిన్నగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య బాండింగ్ ఇలా పెరుగుతుంది. గొడవలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎలాంటి సమస్యలు కూడా రావు. అన్ని విధాలుగా ఇద్దరూ మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా భరోసా ఉన్నారనే సంతోషంగా ఎన్ని కోట్లు పెట్టినా రాదు. భార్యా భర్తల మధ్య ఇలాంటి బాండింగ్ బాగుంటుంది. ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కూడా ఇవి తీరిపోతాయని రిలేషన్‌షిప్ నిపుణులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల పెళ్లయిన కొన్ని రోజులకే విడిపోతున్నారు. ఇలా కాకూడదంటే ఇద్దరి మధ్య కాస్త అర్థం చేసుకునే గుణం తప్పకుండా ఉండాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Relation Tips: భర్తల నుంచి భార్యలు కోరుకునేవి ఇవే!
-
Relationship : భార్య ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు.. అవేంటంటే?
-
Relationship : భాగస్వామితో కలిసి పడుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? పడుకునే పొజీషన్ బట్టి మీ ప్రేమ చెప్పవచ్చు కూడా..
-
Happiness: ఆస్తులు అంటే పొలాలు, డబ్బు, ఫ్లాట్లు కాదు.. బాధలు, నిరాశ లేకపోవడమే అసలైన ఆనందం