Relation Tips: భర్తల నుంచి భార్యలు కోరుకునేవి ఇవే!

Relation Tips:
భార్యాభర్తల బంధం చాలా గొప్పది. అమ్మాయిలు నిజాయితీగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారి ఏమైనా చేసేస్తారు. చాలా మంది అమ్మాయిలు భర్తల దగ్గర నుంచి ఆస్తులు, అంతస్థు కోరుకోరు. భర్త ఇచ్చే విలువైన సమయాన్ని మాత్రం కోరుకుంటారు. చాలా మంది భర్తలకు అసలు ఎలా ఉంటే భార్యలకు నచ్చుతారో కూడా సరిగ్గా తెలియదు. భార్యకు డబ్బు, ఆభరణాలు, విలువైన వస్తువులు ఇస్తే చాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువగా డబ్బు కోసం కష్టపడుతుంటారు. ఎక్కువగా డబ్బు సంపాదించాలని భార్యను బాగా చూసుకోవాలని అనుకుంటారు. కానీ భార్యకు ఏం కావాలో కూడా తెలుసుకోరు. అయితే భార్యలు ఎక్కువగా భర్తల నుంచి కోరుకునేది ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
తమపై శ్రద్ధ చూపించడం
కొందరు భర్తలు అసలు భార్యల మీద శ్రద్ధ చూపించరు. భార్య పక్కన ఉన్నా కూడ మొబైల్ చూడటం, ఏదో ఆలోచించుకోవడం, కనీసం భార్యను పట్టించుకోకుండా ఉంటారు. అయితే భర్తలు ఇలా ఉంటే అసలు భార్యలకు నచ్చదట. భార్యలకు కాస్త టైమ్ ఇస్తూ, వారికి ఎక్కువ సమయం ఇవ్వడం, వారిపై శ్రద్ధ చూపించడం వంటివి చేస్తేనే ఇష్టమట. ఇలాంటివి చేయడం వల్లే భార్యాభర్తల బంధం కూడా బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సర్‌ప్రైజ్‌లు
గిఫ్ట్ చిన్నదైనా, పెద్దదైనా పర్లేదు. కానీ సర్‌ప్రైజ్ చేస్తే భార్యలకు చాలా ఇష్టమట. తమ భర్త కనీసం చాక్లెట్ అయినా కూడా సర్‌ప్రైజ్ చేయాలని కోరుకుంటారు. అడిగితే కాకుండా అడగకుండా ఇవ్వాలని ఎక్కువగా అనుకుంటారు. సడెన్‌గా ఎక్కడికైనా తీసుకెళ్లడం, బయటకు అప్పుడప్పుడు సర్‌ప్రైజ్ ప్లాన్ చేయడం, నచ్చిన వస్తువులు అడగకుండా ఇవ్వాలని చాలా మంది భార్యలు కోరుకుంటారు.
స్పర్శ
ఎప్పుడు రొమాన్స్ కాకుండా కాస్త సమయం భార్య దగ్గర కూర్చోవడం, ఇద్దరూ కలిసి నడవడం, చేతులు పట్టుకుని వెళ్లడం, అప్పుడప్పుడు భార్యను కౌగిలించుకోవడం వంటివి చేయడం ఇష్టమట. ఇలాంటి భర్తలు చేస్తే భార్యలు చాలా హ్యాపీగా పీల్ అవుతారని నిపుణులు చెబుతున్నారు.
కెరీర్ సపోర్ట్
అన్ని విధాలుగా భార్య మనస్సును అర్థం చేసుకుని తనని గౌరవించే భర్తలు అంటే ఇష్టమట. ముఖ్యంగా తమ కెరీర్‌కి సపోర్ట్ చేసే విధంగా భర్తలు ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగం, చదువు ఇలా అన్నింట్లో కూడా భర్తలు భార్యలను సపోర్ట్ చేసే వారంటనే ఇష్టమట.
ఫ్రీడమ్ ఇవ్వడం
నిజానికి భార్యగా మారిన తర్వాత మహిళలు వారి ఇష్టాలు అన్నింటిని కూడా మరిచిపోతారు. ముఖ్యంగా అమ్మాయిలను వారిలా ఉండనివ్వరు. భర్తకి నచ్చినట్లు ఉండనిస్తుంటారు. ఇలా కాకుండా తమని తాములా ఉండనిచ్చే భర్తలను ఎక్కువగా భార్యలు ఇష్టపడతారట. వారికి కొంత సమయం ఇవ్వడం, వారి ఇష్టాలను గౌరవించడం వంటివి చేస్తేనే భార్యలకు భర్తలు నచ్చుతారు.
హెల్ప్ చేయడం
భార్య ఏదైనా పని చేస్తే కాస్త హెల్ప్ చేసే భర్తలు అంటే ఇష్టమట. పెద్దగా హెల్ప్ చేయకపోయినా భార్యకు పని ఉన్నప్పుడు అయినా హెల్ప్ చేస్తే ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. కనీసం ఆ సమయంలో అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇలా ఏ భర్తలు అయితే ఉంటారో వారి భార్యలు చాలా హ్యాపీగా ఉంటారట.
-
New Clock : న్యూ క్లాక్‌లో టైమ్ 10-10 ఎందుకు ఉంటుందంటే?
-
Husband Wife Age Difference: భార్యాభర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది?
-
Relationship : భార్య ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు.. అవేంటంటే?
-
Relation: భార్యాభర్తలు కలిసి ఒకే ప్లేట్లో తిన్నారో.. మీ బంధం నాశనం కావడం ఖాయం