New Clock : న్యూ క్లాక్‌లో టైమ్ 10-10 ఎందుకు ఉంటుందంటే?

New Clock :
ప్రతీ ఒక్కరి ఇంట్లో గడియారం ఉంటుంది. సమయం చూసుకోవడానికి గడియారం ఉండాల్సిందే. ఇప్పుడంటే మొబైల్స్, వాచ్‌లు రకరకాలవి ఉన్నాయి. కానీ అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా గడియారాన్ని వాడేవారు. ఇప్పుడు కూడా కొందరు గడియారం వాడుతున్నారు. ఈ గడియారం ఉంటే రోజులో ఎన్నిసార్లు చూస్తారో వారికే సరిగ్గా తెలియదు. కొందరు అయితే టైమ్ ఎంత అయ్యిందని ప్రతీ నిమిషానికి టైమ్ చూస్తుంటారు. ఒకవేళ బ్యాటరీ అయిపోతే వెంటనే బ్యాటరీ వేయడం లేదా కొత్త గడియారం కొనడం వంటివి చేస్తారు. కొత్త గడియారం కొనడానికి మీరు షాప్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఒక్క గడియారం ట్రయల్ కాకుండా మిగతా గడియారాలు అన్ని కూడా ఒకే టైమ్ చూపిస్తాయి. ఒకే టైమ్ ఏదో ఆరు లేదా 8 ఇలా ఏదో ఒక టైమ్ చూపించవు. కేవలం 10 10 టైమ్ మాత్రమే చూపిస్తుంది. అసలు కొత్త గడియారంలో సమయం ఎందుకు 10 10 చూపిస్తుంది? కేవలం ఒక గడియారం అనే కాకుండా అన్ని కొత్త గడియారాలు కూడా ఇలానే ఎందుకు ఉంటాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కొత్త గడియారంలో 10 10 సమయం అనేది మంచిదని, అందుకే ఈ సమయం పెట్టారని చాలా మంది అనుకుంటారు. మరికొందరు గడియారం మొదటిసారి రెడీ అయ్యే సమయానికి టైమ్ ఇంతే అయ్యిందని, అందుకే ప్రతీ కొత్త గడియారంలో ఇదే టైమ్ సెట్ చేస్తారని అనుకుంటారు. కానీ గడియారంలో 10 10 సమయం ఉండానికి ఓ కారణం ఉందట. 10 10 కనిపించే టైమ్‌లో పెద్ద ముల్లు, చిన్న ముల్లు విక్టరీ సింబల్‌ను చూపిస్తాయట. అంటే ఈ షేప్‌లో చూడటానికి V షేప్‌లో ఉంటాయి. అయితే కేవలం 10 దగ్గర ఎందుకు ఉండాలనే డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. అయితే రెండు పాయింట్స్ మధ్య క్లాక్ కంపెనీ పేరు ఉంటుంది. వాటి బ్రాండ్ క్లియర్‌గా కనిపించాలనే ఉద్దేశంతో వీటి మధ్య ఎక్కువగా గ్యాప్ ఇస్తారు. ఈ కారణంగానే 10 10 టైమ్ ప్రతీ కొత్త గడియారంలో ఉంటుంది. అలాగే వీటితో పాటు ప్రతీ గడియారం కూడా స్మైలీ సింబల్‌ను చూపిస్తుంది. అంటే అలా నవ్వుతూ ఉండటం వల్ల ప్రతీ కస్టమర్ కూడా తప్పకుండా గడియారాన్ని కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో ఈ సమయాన్ని పెడతారట. ఈ షేప్ కాకుండా మిగతా ఏ షేప్ కూడా పెద్దగా ఆకర్షణగా ఉండదు. దీనివల్ల అన్ని కంపెనీ గడియారాలు ఇవే షేప్‌ను ఉపయోగిస్తాయి. అలాగే కంపెనీ పేరు కూడా స్పష్టంగా ఉంటుంది. దీంతో మీకు గడియారం కొనాలనే ఆలోచన కూడా వస్తుంది. ఈ కారణాల వల్ల మాత్రమే కొత్త క్లాక్‌లో 10 10 టైమ్ చూపిస్తుందట.
Clock, Time, Same Time, V Shape