Astrology Remedies: భార్యలు మీరు ఇలా చేస్తే.. మీ భర్తే ఇక కోటీశ్వరుడు

Astrology Remedies: భార్య సంతోషం, సక్సె్స్‌లో భర్త ఎలా వెనుక ఉంటాడో.. భర్త ఆదాయం, సంపాదన, సంతోషం వెనుక భార్య కూడా ఉంటుంది. కుటుంబం మంచిగా నడవాలి అంటే భర్తతో పాటు భార్య కూడా మంచిగా ఉండాలి. అందరి కంటే తన భర్త గొప్పగా, ధనవంతుడు అయి ఉండాలని ప్రతీ భార్య కోరుకుంటుంది. అయితే మిగతా వారితో పోలిస్తే తన భర్త కోటీశ్వరుడు అయి ఉండాలంటే ప్రతీ భార్య కొన్ని నియమాలు పాటించాలి. కష్టపడటంతో పాటు భార్యగా తన నియమాలు పాటిస్తేనే భర్తకు అదృష్టం వస్తుంది. భార్య వల్ల ప్రపంచాన్ని శాసించిన భర్తులు ఉన్నారు.. నాశనం అయిన భర్తలు ఉన్నారు. అయితే భర్త కోటీశ్వరుడు కావాలంటే భార్య పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
భార్య తప్పకుండా కొన్ని సంప్రదాయాలు పాటించాలి. అప్పుడే కుటుంబానికి, భర్తకి మంచిది. అయితే చాలా మంది అమ్మాయిలు ఈ రోజుల్లో బొట్టు పెట్టుకోవడం లేదు. కానీ పెళ్లి అయిన ప్రతీ అమ్మాయి ఉదయాన్నే తొందరగా లేని స్నానం చేయాలి. ఆ తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని పూజలు చేయాలి. దీనివల్ల భర్తకు అదృష్టం కలసి వస్తుంది. ఒక్కసారిగా ఆదాయం పెరుగుతుంది. అయితే బొట్టు పెట్టుకునే టప్పుడు ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపిణి.. మమ కుటుంబ రక్షాం.. కురు కురు స్వాహాః.. అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల భర్త ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాడు. అలాగే భార్య ఉదయం పూట స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి వెళ్లాలి. ఇలా వెళ్లినప్పుడు టీ ఏదైనా పెడితే స్టవ్ వెలిగిస్తారు. అప్పుడు ఓం బ్రహ్మణే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా జపించడం వల్ల భర్త సంపాదన పెరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే మహిళలు ఉదయం లేచిన వెంటనే వినాయకుడు ఫొటో చూడాలి. ఆ తర్వాత భర్త కాళ్లను కూడా మొక్కాలని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల భర్తలకు అదృష్టం కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఒక ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎండు ద్రాక్షలు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల భర్తలు కోటీశ్వరులు అవుతారు.
ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
వంటింట్లో ఉండే యాలకులు ఎండిపోకుండా ఆకుపచ్చగానే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ధనం ఆకర్షిస్తుంది. అంటే ఆకుపచ్చని యాలకులకు ధనం ఆకర్షించే శక్తి ఉంది. దీనివల్ల కోటీశ్వరుడు అవుతారని అంటున్నారు. అలాగే ఒక పసుపు క్లాత్‌లో శుక్రవారం నాడు ఐదు యాలకులను వేసి కట్టాలి. దీన్ని బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే పచ్చ కర్పూరం పూజ గదిలో ఒక మూట కట్టి పెట్టడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది. దీనికి ప్రతీ రోజు పూజ చేయడం వల్ల భర్త కోటీశ్వరుడు అవుతాడు. అలాగే ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించాలి. అయితే వీటిని అన్ని రోజుల్లో కాకుండా ఆదివారం, శుక్రవారాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Money: ఈ ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటే.. లెక్కలేనంత ధనం మీ సొంతం
-
Chanakyaniti: డబ్బు సంపాదించడం కాదు.. పొదుపు ముఖ్యం.. చాణక్యుడు చెప్పే సూత్రాలివే
-
Numerology: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. మీరే కింగ్ ఇక
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
-
Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
-
Sitara: తండ్రికి తగ్గ తనయ.. స్టార్ హీరోయిన్ కంటే సితార ఫాలోయింగ్ మాములుగా లేదుగా!