Happiness: ఆస్తులు అంటే పొలాలు, డబ్బు, ఫ్లాట్లు కాదు.. బాధలు, నిరాశ లేకపోవడమే అసలైన ఆనందం

Happiness:
చాలా మంది ఈ రోజుల్లో గెట్‌టూ గెదర్ జరుపుకుంటుంటారు. చాలా ఏళ్ల తర్వాత స్నేహితులు ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అయితే అందరూ కూడా కలిసిన తర్వాత వారు ఏ ఉద్యోగం చేస్తున్నారనే విషయాన్ని ఎక్కువగా చర్చించుకుంటారు. సాధారణంగా మనకి ఎవరైనా చాలా ఏళ్ల తర్వాత కలిసినా కూడా ఏం చేస్తున్నావు? ఎంత జీతం నెలకి? ఎంత సంపాదించావనే విషయాన్ని ఎక్కువగా అడుగుతారు. అందరూ కూడా నేను ఆ ఉద్యోగం చేస్తున్నానని, లక్షలు సంపాదించాను, కార్లు కొన్నాను, ఒక ఇంటి స్థలం కొన్నాను.. ఇలా ఒకటేంటి లేనివి కూడా క్రియేట్ చేసుకుని గొప్పగా చెప్పుకుంటారు. డబ్బు, ఆస్తులు, ఫ్లా్ట్లు, బంగారం, వస్తువులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి.. అన్ని రిచ్ వస్తువులు ఉంటే చాలు.. లైఫ్‌లో సెటిల్ అయ్యారని భావిస్తారు. అసలు లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే ఇవి కాదు. జీవితంలో సెటిల్ కావడం అంటే ఉన్నతంగా ఉండటం, డబ్బు సమస్యలు కావు. ఇంతకీ సెటిల్ కావడం అంటే ఏంటి? నిజమైన సక్సెస్ అంటే ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
జీవితంలో మనం ఉన్నతంగా ఎదిగామనేది మన వెనుక ఉన్న డబ్బు డిసైడ్ చేస్తుంది. కానీ మన విలువలు ఎంత ఉన్నతంగా ఉంటేనే మనం నిజంగా సక్సెస్ అయినట్లు. ఎలా అంటే కొందరికి డబ్బు అన్ని కూడా ఉంటాయి. కానీ మనశ్శాంతి ఉండదు. మనిషికి మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నారు. కానీ మానసికంగా మాత్రం చాలా సమస్యలతో బాధపడుతున్నారు. సంతోషం లేకపోవడం, అత్యాశ, నిరాశ, అసూయ, అహంకారం, అసంతృప్తి, ఒత్తిడి, విసుగు, మానసిక సంతోషం లేకపోవడం, చిరాకు, కోపం, ఈగో వంటివి ఉంటాయి. జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇవి లేకపోతే వ్యర్థమే. జీవితంలో ఆనందం, మెచ్యూరిటీ లేకపోతే అసలు ఎంత డబ్బు ఉన్నా వ్యర్థమే.
జీవితంలో ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో కష్టపడే పైకి వెళ్తుంటారు. ఎంత పైకి వెళ్లినా కూడా మనశ్శాంతి, సంతోషం లేకపోతే వ్యర్థమే. డబ్బు, ఆస్తులే సక్సెస్ అని చాలా మంది ఫీల్ దాని వెనుక పరుగెడుతుంటారు. కానీ అసలైన సక్సె్స్ అంటే ఆనందం, సంతోషం, ప్రశాంతత, మానసిక ఆరోగ్యం అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే నిజమైన సక్సెస్ వస్తుంది. డబ్బు వెనుక ఎప్పుడూ కూడా పరిగెత్తవద్దు. దాని వెనుక పడటం ఇకనైనా ఆపేయండి. జీవితం ఏంటనే విషయాన్ని ఇకనైనా గ్రహించి.. లైఫ్‌లో ముందుకెళ్లండి. అప్పుడే మీరు మంచి హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తారు.