Roja Vs Gali Bhanu Prakash: నగరి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై రోజా ఫైర్
Roja Vs Gali Bhanu Prakash మహిళల చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్యేపై చర్యలుతీసుకోవాలని రోజా కోరారు.

Roja Vs Gali Bhanu Prakash: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై రోజా మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా కమిషన్ ను ఆశ్రయించారు. ఈ సందర్బంగా మహిళల చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్యేపై చర్యలుతీసుకోవాలని రోజా కోరారు. ఇక అంతకుముందు భాను ప్రకాశ్ ను అరెస్ట్ చేయాలని రోజా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ రోజా గురించి 2000 ఇస్తే ఏ పనైనా చేసిది. మార్కెట్లో ఆ మాట ఉంది అన్ని అన్నాడు.
దీంతో రోజా ఫైర్ అయ్యారు రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. గాలి భాను ప్రకాశ్ నన్న అసభ్యకరంగా బాధపెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలో మనం నివసిస్తున్నాం.. ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రోజా అన్నారు.