YSRCP Axe Symbol: గొడ్డలి గుర్తు కోసం వైసీపీ లేఖ.. సంచలనం
YSRCP Axe Symbol ఈ ప్రచారంపై కొలిశెట్టి శివకుమార్ స్పందిస్తూ, ఈ లేఖ నకిలీదని స్పష్టం చేశారు. తాను ఎటువంటి లేఖ రాయలేదని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

YSRCP Axe Symbol: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గుర్తును మార్చుకోబోతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీకి ఉన్న ఫ్యాన్ గుర్తుకు బదులుగా ‘గొడ్డలి’ గుర్తును కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే, ఈ ప్రచారంపై కొలిశెట్టి శివకుమార్ స్పందిస్తూ, ఈ లేఖ నకిలీదని స్పష్టం చేశారు. తాను ఎటువంటి లేఖ రాయలేదని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజకీయ వ్యూహాల దృష్ట్యా పార్టీ గుర్తును మార్చాల్సిన అవసరం ఉందంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి పేరుతో పార్టీని రిజిస్టర్ చేసిన శివకుమార్, జగన్‌కు మద్దతు ఇచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ‘గొడ్డలి’ చిహ్నం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో వివాదాస్పదంగా మారడం గమనార్హం.
మాకు గొడ్డలి గుర్తు కావాలి. ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిన వైసిపి ఫౌండర్ శివకుమార్🤙🤙🤙🤙🤙
రప్ప రప్పా 🤣🤣🤣🤣🤣🤣#ysrcp #sivakumarysrcp pic.twitter.com/QA6qk5isxV— Sai Chaitanya Yenumula (@Ye7Sai) July 15, 2025