Jabardast Ramprasad: సుధీర్, గెటప్ శ్రీనులపై రామ్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
Jabardast Ramprasad ఎప్పటికైనా మనం ముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలనిన ఉందని అన్నారు. అందుకు శ్రీను, సుధీర్, సన్నీ కూడా ఎమోషనల్ అయ్యారు.

Jabardast Ramprasad: సుధీర్, గెటప్ శ్రీనులపై రామ్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సర్కార్ సీజన్ 5లోన తాజాగా ఎపిసోడ్ కు హాజరైన ఆటో రామ్ ప్రసాద్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ లో మనం దాదాపు 10 ఏళ్లు కలిసి పనిచేశాం. ఒకరోజు మీరు వెళ్లిపోయిన తర్వాత నేను ఒక్కడినే స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. ఆరోజు నాకు గుండె బద్దలైనట్లు అనిపించింది. ఏదో శక్తి వెనక్కి లాగుతున్నట్లు అనిపింది. మీరు లేకుంటే చాలా బాధగా ఉంది.
ఎప్పటికైనా మనం ముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలనిన ఉందని అన్నారు. అందుకు శ్రీను, సుధీర్, సన్నీ కూడా ఎమోషనల్ అయ్యారు. సుడిగాలి సుధీర్ తన కెరీయర్ కారణంగా జబర్దస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే. మరో వైపు గెటప్ శ్రీను కూడా సినిమాల్లో మంచి వేషాలు దొరకడంతో జబర్దస్త్ వీడాడు. ప్రస్తుతం గెటప్ శ్రీను కమెడియన్ గా, సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. సుధీర్ మళ్లీ టెలివిజన్ షోలతో సందడి చేస్తున్నాడు.