Actor Ali Family History: అలీది రాజమండ్రి కాదా?
Actor Ali Family History వివిధ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశీ పౌరులు చాలామంది భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చిన కుటుంబమే అలీ ది అని తెలుస్తోంది.

Actor Ali Family History: సినీ నటుడు అలీ( cinema actor Ali ) గురించి పరిచయం అవసరం లేదు. బాల నటుడుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. ఎన్నెన్నో వైవిధ్యభరిత పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా హాస్యనటుడిగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు. అయితే అలీ సొంత ఊరు రాజమండ్రి. అందుకే అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే అలీది రాజమండ్రి అయినా.. ఆయన కుటుంబ మూలాలు మాత్రం బర్మా అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే అలీ రాజమండ్రి వాసి గానే అందరికీ సుపరిచితం. కానీ ఆయన కుటుంబం మూలాలు ఒకప్పటి బర్మా.. నేటి మయన్మార్ కావడం గమనార్హం.
* అలా బర్మా నుంచి వచ్చి..
వివిధ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశీ పౌరులు చాలామంది భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చిన కుటుంబమే అలీ ది అని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ( second world battle ) సమయంలో అలీ తాత, తండ్రి, నానమ్మ, ఆమె తమ్ముడు.. రాజమండ్రి చేరుకున్నారట. ఇక్కడే స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించే వారట. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలంటే అలీకి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన మద్రాస్ వెళ్లారు. బాల నటుడిగా మంచి అవకాశాలు దక్కించుకున్నారు. తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
* రాజమండ్రి అంటే ప్రాణం..
అయితే నాడు బర్మా( Bharma) నుంచి వచ్చిన అలీ కుటుంబం.. క్రమేపీ విస్తరించింది. ప్రస్తుతం రాజమండ్రిలో అలీ బందు గణానికి సంబంధించి వెయ్యి కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజమండ్రి తనకు అన్నీ ఇచ్చిందని అలీ చెబుతుంటారు. అందుకే పుట్టిన గ్రామానికి సేవ చేయాలని భావిస్తుంటారు. తన ట్రస్టు ద్వారా చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. రాజమండ్రి వాసులు కూడా అలీని తమ సొంత వ్యక్తిగా భావిస్తుంటారు. అలీ ఏటా రాజమండ్రి వస్తుంటారు. స్థానికులను కలుస్తుంటారు. రాజమండ్రి తో తనకు విడదీయరాని బంధం ఉందని ప్రతి సందర్భంలో చెబుతారు అలీ.