Tourist Family Collection: 7 కోట్లతో తీస్తే 90 కోట్ల కలెక్షన్స్..
Tourist Family Collection కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మిధున్ జై శంకర్, కమలేష్ జగన్, ఎం శశికుమార్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 29 ఏప్రీల్ 2025న థియేటర్లలో విడుదలైంది.

Tourist Family Collection: టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 7 కోట్లతో తీస్తే 90 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఛవా. అయితే ఛావా సినిమా రికార్డును ఓ చిన్న సినిమా బ్రేక్ చేసింది. కేవలం 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా లాభం 1200 శాతం ఎక్కువ. టూరిస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ కేవలం రూ 7 కోట్లు. అభిషాన్ జీవత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ 90 కోట్లు వసూలు చేసింది.
కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మిధున్ జై శంకర్, కమలేష్ జగన్, ఎం శశికుమార్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 29 ఏప్రీల్ 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి వారంలోనే రూ 23 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ ఉండడంతో సూపర్ బిజినెస్ చేసింది. ఇండియాో రూ 62 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ 90 కోట్లు వసూలు చేసింది.