DA Increase: పండుగ కానుకగా ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం…పండుగ ముందు రోజే జీతాల పెంపుపై కీలక ప్రకటన…

DA Increase:
ఉద్యోగులకు పండుగ కానుకగా మోడీ సర్కార్ అదిరిపోయే శుభవార్తను అందించబోతుంది. మంచి గుడ్ న్యూస్ అందించడానికి మోదీ ప్రభుత్వం రెడీ అవుతుంది.
పండగ సందర్భంగా ఉద్యోగులకు శుభవార్త లభించే అవకాశం ఉంది. మోడీ సర్కార్ డియర్ నెస్ అలవెన్స్కు సంబంధించి కీలక ప్రకటనలు చేయొచ్చు అనే అంచనాలు నెలకొన్నాయి. త్వరలో హోలీ పండుగ వస్తుంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం హోలీ పండుగ కన్నా ముందుగానే డిఏ పెంపు పై కీలక ప్రకటన చేయొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వార్త కనుక నిజమైతే ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా ఊరట లభిస్తుంది. అయితే ఇప్పటివరకు దీని గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలు నివేదికలు త్వరలో ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ మరియు డియర్ నెస్ రిలీఫ్ పెంపును ప్రకటించే అవకాశం ఉందని తెలియజేస్తున్నాయి. 12 మిలియన్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది ప్రభావం చూపిస్తుంది. వివిధ మీడియా కథనాల ప్రకారం హోలీ పండుగకు ముందు రాబోయే రోజుల్లో డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డి ఏ ను సవరిస్తుంది. జనవరిలో మరియు జూలైలో డిఏ పెంపు ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అయితే వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు మాత్రం తర్వాత వస్తాయి.
డి ఎ వర్తింప చేసేది మాత్రం జనవరి నెల నుంచి లేదా జూలై నెల నుంచి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు జనవరి సవరణను సాధారణంగా హోలీ సమయంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అలాగే జూలై సవరణను అక్టోబర్ లేదా నవంబర్లో దీపావళికి సమీపంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనల్లో కొనుగోలు శక్తిపై ద్రవయోల్బణం ప్రభావం నుండి వారిని రక్షించడానికి ఈ బాధ్యతలను సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది ఎంత పెంపు ఉంటుందని అంచనా వేస్తే డిసెంబర్ 2024 డేటా ప్రకారం డిఏ లో రెండు శాతం పెరుగుదల ఉండొచ్చని చెప్తున్నారు. ఈ క్రమంలో డిఏ మరియు డిఆర్ 55% వద్ద ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం ప్రధానమంత్రి నేతృత్వంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. డి ఎ రేటును సిమ్లా లోని లేబర్ బ్యూరో రూపొందించిన ఆయిల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా లెక్కిస్తారు.