Cool Drinks: వేసవిలో తెగ కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా?
Cool Drinks నిపుణుల అభిప్రాయం ప్రకారం, శీతల పానీయాలు తాగడం వల్ల కొన్ని ఆహారాలు తినాలనే, త్రాగాలనే కోరిక తగ్గుతుంది. శీతల పానీయాలు కొంతకాలం మీ ఆకలిని తీర్చవచ్చు.

Cool Drinks: వేసవిలో, మండే ఎండ నుంచి వచ్చిన వెంటనే ప్రజలు రిఫ్రిజిరేటర్ తెరిచి చల్లని పానీయం తాగడానికి ఇష్టపడతారు. లేదంటే షాపులో కొనుక్కొని తాగేస్తారు. ఇక బయటకు వెళ్తే పెద్ద పెద్ద బాటిల్స్ ను తెచ్చుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు తాగాలి అనిపిస్తే అప్పుడ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో.. దీనితో పాటు, సాయంత్రం పూట చిరుతిళ్లు తింటూ, ఆహారం జీర్ణం చేసుకుంటూ, సినిమాలు ఆస్వాదిస్తూ చల్లని నీటిని కూడా ప్రజలు ఇష్టపడతారు. ఒక గుక్క శీతల పానీయాలు, సోడా మండే ఎండ, వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. కానీ దీర్ఘకాలంలో శరీరంపై చెడు ప్రభావాలను చూపుతుంది. అయితే వేసవిలో శీతల పానీయాలు, సోడా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే శీతల పానీయాలను తయారు చేయడానికి అనేక రకాల హానికరమైన రంగులు, కృత్రిమ రుచులను ఉపయోగిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
బరువు పెరుగుతారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, శీతల పానీయాలు తాగడం వల్ల కొన్ని ఆహారాలు తినాలనే, త్రాగాలనే కోరిక తగ్గుతుంది. శీతల పానీయాలు కొంతకాలం మీ ఆకలిని తీర్చవచ్చు. కానీ తరువాత మీరు ఎక్కువ తినవలసి వస్తుంది. ఈ కారణంగా, బరువు వేగంగా పెరుగుతారు. శీతల పానీయాల తయారీకి చాలా చక్కెరను ఉపయోగిస్తారు. శీతల పానీయాలలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారు.
జీర్ణ శక్తి..
కార్బన్ డయాక్సైడ్ శీతల పానీయాలు, సోడాలలో ఉంటుంది. ఒక వ్యక్తి కూల్ డ్రింక్ లేదా సోడా తాగినప్పుడు, కడుపులో వేడి కారణంగా అది గ్యాస్‌గా మారుతుంది. ఈ కారణంగానే కొంతమందికి శీతల పానీయాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బుతుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలంలో కడుపు దెబ్బతింటుంది. ఇందులో ఉండే కార్బన్ హై ఆక్సైడ్ కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణ ఎంజైమ్‌లను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా, కడుపు నొప్పి, మలబద్ధకం, వాంతులు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాు ఎక్కువసేపు శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణ శక్తి బలహీనపడుతుంది.
కాలేయ సంబంధాలు..
శీతల పానీయాలు అధికంగా తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఇతర కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. శీతల పానీయాలలో కృత్రిమ చక్కెర కలుపుతారు. కృత్రిమ చక్కెరలో రెండు ప్రధాన సమ్మేళనాలు ఉంటాయి. అవే గ్లూకోజ్, ఫ్రక్టోజ్. దీనిలోని ఫ్రక్టోజ్ కాలేయం ద్వారా జీవక్రియగా మారుతుంది. కానీ ఎక్కువగా శీతల పానీయాలు తాగడం వల్ల శరీరంలో అధిక ఫ్రక్టోజ్ ఏర్పడుతుంది. దీని కారణంగా కాలేయం ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. ఇది కాలేయంలో పేరుకుపోతుంది. దీన్ని ఎక్కువసేపు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
డయాబెటిస్..
అధిక మొత్తంలో శీతల పానీయాలు తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు. శరీరంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల, టైప్-2 డయాబెటిస్ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. శీతల పానీయాలు, సోడాలు తీసుకోవడం వల్ల ప్రజలు మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.