Cool Drinks : వచ్చింది ఎండాకాలం.. కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? మీ చేతులతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నట్టే..

Cool Drinks :
చాలా మంది కూల్ డ్రింక్స్ ను ఇష్టంగా తాగుతారు. ఇక వచ్చింది ఎండాకాలం కాబట్టి మరింత ఎక్కువ తాగుతారు. ఫ్రిజ్ లో స్టోర్ చేసి మరీ పెడుతుంటారు. తాగగానే కడుపులో చల్లగా అనిపిస్తుందని.. ఎండ నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది తాగుతుంటారు. కానీ వీటి వల్ల చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
ఈ శీతల పానీయాలలో చాలా చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎక్కువగా తాగితే మధుమేహం, ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి కూల్ డ్రింక్స్. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, శీతల పానీయాలలో ఎటువంటి పోషకాలు ఉండవు. అంతేకాదు దీనిలో చక్కెర, కేలరీల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ప్యాక్ చేసిన జ్యూస్‌లను చక్కెర పానీయాలు అని కూడా అంటారు. అందువల్ల దీన్ని తక్కువ పరిమాణంలో తాగడమే మంచిది. ఇవి తాగితే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. సో ఎక్కువగా తాగకుండా ఉండాలి.
ఎంత చక్కెర ఉంటుంది?
శీతల పానీయాలలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కెర వినియోగం బరువు పెరగడంతో సహా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఒక గ్లాసు శీతల పానీయంలో ఎనిమిది నుంచి 10 చెంచాల చక్కెర ఉంటుంది. అదేవిధంగా, మీరు శీతల పానీయాలు తాగడం ద్వారా మీ ఆహారంలో చక్కెరను తీసుకుంటున్నట్టే. ఇది మన ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు. ఒక గ్లాసు శీతల పానీయంలో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. ప్రతిరోజూ ఇన్ని కేలరీలు తీసుకుంటే బరువు పెరగరా చెప్పండి. సో స్కిప్.
కొవ్వు కాలేయ సమస్య: శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కూడా కొవ్వు కాలేయ సమస్య వస్తుంది. శీతల పానీయాలలో రెండు రకాల చక్కెరలు ఉంటాయి. అవే గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఇవి జీవక్రియ మీద ఎఫెక్ట్ ను చూపిస్తాయి. మరోవైపు, ఫ్రక్టోజ్ కాలేయంలో మాత్రమే నిల్వ అవుతుంది. ఇక ప్రతిరోజూ శీతల పానీయాలు తాగుతుంటే, ఫ్రక్టోజ్ మీ కాలేయంలో అధికంగా పేరుకుపోతుంది. కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
డయాబెటిస్ సమస్యలు: శీతల పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల కూడా మధుమేహం వస్తుంది. శీతల పానీయాలు శరీరంలో చక్కెరను వెంటనే పెంచుతాయి. ఇది ఇన్సులిన్‌ను వేగంగా విడుదల చేస్తుంది కూడా. కానీ మీరు ఇన్సులిన్ హార్మోన్‌ను పదే పదే భంగం చేస్తే, అది హాని కలిగిస్తుంది.
దంతాలపై ప్రభావం: ఇవి విని షాక్ అయ్యారా? కానీ మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటే దంతాలపై కూడా ప్రభావం చూపుతుందనేది నిజం. శీతల పానీయాలలో ఫాస్పోరిక్ ఆమ్లం, ఇతర రకాల ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన దంతాలకు హాని కలిగిస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..
-
Cool Drinks: వేసవిలో తెగ కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా?
-
Weight Gain Tips: వీక్ గా ఉంటున్నారా? గుర్రంలా పరుగెత్తించేలా చేస్తాయి ఇవి.
-
Fridge : పిండి పిసికి ఫ్రిజ్ లో పెడుతున్నారా?