Micro Workouts : జిమ్‌కు వెళ్లడానికి టైం లేదా?.. ఈ మైక్రో వర్కౌట్స్ ట్రై చేయండి

Micro Workouts : ప్రస్తుతం ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. బిజీ షెడ్యూల్ కారణంగా కొంతమంది టైంకు భోజనం కూడా చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఆరోగ్యం, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మీకు కూడా బిజీ షెడ్యూల్ వల్ల నిత్యం వ్యాయామం చేయడానికి లేదా జిమ్‌కు వెళ్లడానికి సమయం దొరకకపోతే నిపుణుల సలహా మేరకు ‘మైక్రో వర్కౌట్లు’ చేయడం మొదలు పెట్టండి. అసలు మైక్రో వర్కౌట్ అంటే ఏమిటి. వాటిని ఎలా చేయాలో ఈ వార్తలో తెలుసుకుందాం.
మైక్రో వర్కౌట్ అంటే ఏమిటి?
మైక్రో వర్కౌట్లు అంటే తక్కువ నుంచి అధిక తీవ్రత కలిగిన చిన్న పాటి వ్యాయామాలు. ఇవి రోజంతా మీ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి సాయపడతాయి. ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ’లో ప్రచురించిన ఒక అధ్యయనంలో..యువకులను 20 సెకన్ల పాటు సాధ్యమైనంత వేగంగా పెడల్ తొక్కాలని సూచించారు. వారు ఈ మైక్రో వర్కౌట్‌ను ఇలా రోజుకు 3 సార్లు చేశారు. 6 వారాల తర్వాత వారి కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ 9% మెరుగుపడింది. అదేవిధంగా, ‘మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్’లో ప్రచురించిన మరొక అధ్యయనంలో ఆరోగ్యంగా ఉన్న మహిళలు మూడు వారాల పాటు రోజుకు 3 సార్లు 20 సెకన్ల పాటు వేగంగా మెట్లు ఎక్కడం ద్వారా తమ కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ను మెరుగుపరిచారని కనుగొన్నారు. జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండడానికి మైక్రో వర్కౌట్ ఒక అద్భుతమైన మార్గంగా చెప్పుకోవచ్చు.
Read Also:Viral Video : వందలాది ప్రాణాలను కాపాడిన ఫైలట్.. వైరల్ అవుతున్న వీడియో
ఎక్కడైనా మైక్రో వర్కౌట్ చేయడానికి నిపుణుల సలహాలు:
1. డెస్క్ రేజెస్ : మీరు ఆఫీసులో పనిచేస్తున్నట్లయితే డెస్క్‌పై కూర్చుని మీ కాళ్ళను పైకి లేపండి.
2. వాకింగ్ మీటింగ్ : జూమ్ మీటింగ్ సమయంలో కూర్చుని ఉండకుండా, నడవండి.
3. చిన్ అప్స్ : ఆఫీసు తలుపును ఉపయోగించి కనీసం 1-3 చిన్-అప్లు చేయండి.
4. కాఫీ ప్లాంక్ : కాఫీ తయారయ్యే వరకు ప్లాంక్ చేయండి.
5. స్క్వాట్ : కుర్చీలో కూర్చునేటప్పుడు కనీసం 10 సార్లు బాడీ వెయిట్ స్క్వాట్స్ చేయండి.
6. కార్డియో : మీకు ఇష్టమైన షో చూస్తున్నప్పుడు బ్రేక్ తీసుకుని కార్డియో చేయండి. ఈ సమయంలో జంపింగ్ జాక్స్ , స్ప్రింట్స్ నిమిషం పాటు చేయండి.
7. వాల్ సిట్ : బ్రష్ చేస్తున్నప్పుడు గోడకు ఆనుకుని నిలబడి తర్వాత 90 డిగ్రీల కోణంలో వంగండి. బ్రష్ చేసేంత వరకు ఈ స్థితిలో ఉండండి.
8. స్టెప్ అప్ : మెట్లు ఎక్కేటప్పుడు ఒక మెట్టు వదిలి మరో మెట్టు ఎక్కండి.
9. స్క్వాట్ నుండి పుష్అప్ : భోజనం చేయడానికి ముందు కనీసం 20 బాడీ వెయిట్ స్క్వాట్స్ చేసి, తర్వాత 10 పుష్అప్లు చేయండి.
10. హిప్ థ్రస్ట్ : టీవీ చూస్తున్నప్పుడు కనీసం 15 హిప్ థ్రస్ట్‌లు చేయండి.
11. ట్రై సెట్ సర్క్యూట్ : 5 నిమిషాల టైమర్ సెట్ చేసి 3 వ్యాయామాల సెట్‌ను చేయండి.
12. స్టెయిర్ వర్కౌట్ : రెండు వ్యాయామాలతో ప్రారంభించి వాటిని 5 సార్లు పునరావృతం చేయండి.
13. తబాటా : 4 నిమిషాల టైమర్ సెట్ చేయండి. ప్రతి 20 సెకన్లకు అధిక తీవ్రత కలిగిన వ్యాయామం చేయండి. తర్వాత 10 సెకన్లు విశ్రాంతి తీసుకోండి. ఇలా మొత్తం 8 రౌండ్లు చేయండి.
14. బియర్ క్రాల్ : ఎలుగుబంటి లాగా పాకుతూ మరోవైపుకు వెళ్ళండి.
15. ఫార్మర్ క్యారీస్ : మీ పెరట్లో డంబెల్స్ సెట్‌ను ఉంచండి, వాటిని ఉపయోగించినప్పుడల్లా వాటిని మరో వైపుకు తీసుకెళ్ళండి.
16. బాడీ సర్క్యూట్ : భోజనానికి ముందు 15 స్క్వాట్స్, 10 పుష్అప్లు, ప్రతి వైపు 45 సెకన్ల పాటు సైడ్ ప్లాంక్ చేయండి.
ఈ మైక్రో వర్కౌట్ల ద్వారా బిజీగా ఉన్నప్పటికీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
Read Also:Viral Video : ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వేడి నుంచి తప్పించుకోవాలంటే బావిలో మంచం వేసుకోవాలా ?
-
Smell Weight Loss: స్మెల్ చూసి బరువు తగ్గవచ్చు.. ఎలాగో ఆర్టికల్‌పై లుక్కేయండి
-
Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా?
-
Walking Rule: 6-6-6 రూల్ పాటిస్తే.. వందేళ్లు అయిన ఆరోగ్యం మీదే
-
Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
-
CPR: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా సీపీ ఆర్ చేస్తే.. ప్రాణాలు సేఫ్