Viral Video : వందలాది ప్రాణాలను కాపాడిన ఫైలట్.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video : గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్‌కు 242 మందిని తీసుకువెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే (మే 12న) కూలిపోయింది. ఈ షాకింగ్ ఘటనలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారందరూ మరణించారు. వందలాది మంది ఎన్నో ఆశలు, కలలతో ప్రయాణాన్ని మొదలు పెట్టిన క్షణాల్లోనే వారి ప్రాణాలు ఈ ప్రమాదంలో గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదాన్ని విమాన ప్రమాదాల చరిత్రలోనే అతిపెద్దదిగా పరిగణిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తల మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మరో వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పైలట్ తన సమయస్ఫూర్తితో ‘బర్డ్ స్ట్రైక్’ను క్షణాల్లో ఎలా తప్పించాడో ఈ వీడియోలో చూడవచ్చు.
బర్డ్ స్ట్రైక్ చాలా ప్రమాదకరం
విమానం గాలిలో ఉన్నప్పుడు పైలట్ పక్షుల కదలికల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు ‘బర్డ్ స్ట్రైక్’ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడం వల్ల పక్షిని ఢీకొట్టకుండా తప్పించుకోవడం కష్టం. ఇలాంటి ‘బర్డ్ స్ట్రైక్‌లు’ విమానానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఖరీదైన మరమ్మతులు, ఎమర్జెన్సీ ల్యాండింగ్లకు కూడా దారితీయవచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. ‘aviationwg’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో పైలట్ తన చాకచక్యంతో పక్షి నుండి విమానాన్ని, అందులోని ప్రజలను ఎలా కాపాడాడో చూడవచ్చు.
Read Also:Viral Video : ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వేడి నుంచి తప్పించుకోవాలంటే బావిలో మంచం వేసుకోవాలా ?
View this post on Instagram
Read Also:Father’s Day: ఫాదర్స్ డే ఎలా వచ్చింది? ఆదివారమే ఎందుకు?
పైలట్ సమయస్ఫూర్తికి ప్రశంసలు
సుమారు 18 వారాల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 9 మిలియన్ల (90 లక్షలు) వ్యూస్, వేలాది కామెంట్స్ వచ్చాయి. ఒక నెటిజన్ పైలట్ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ గ్రేట్ జాబ్ అని రాశారు. మరొక నెటిజన్ ‘పైలట్ తమ ప్రాణాలను తామే కాపాడుకున్నారు’ అని అన్నారు. ఇంకొక నెటిజన్ ఈ దృశ్యం చూసి పైలట్ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు.ఈ సంఘటనలు విమాన భద్రత, పైలట్ల నైపుణ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు