Andre Russell Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు రస్సెల్ గుడ్ బై
Andre Russell Retirement ఐపీఎల్ కోల్ కతా తరఫున అడుతుండగా ఈ టీం తరఫున ఆడడం తనకు చాలా ఇష్టమని చాలా సార్లు చెప్పుకొచ్చాడు.

Andre Russell Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు రస్సెల్ గుడ్ బై చెప్పాడు. ఈనెల 22న సొంత మైదానం సబీనా పార్క్ లో ఆస్ట్రేలియాతో రెండో టీ20 రస్సెల్ కెరీర్ కు చివరిది కానుంది. టీ20 క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రస్సెల్ 2012, 2016 టీ 20 వరల్డ్ కప్ లు నెగ్గిన వెస్టిండీస్ జట్లో సభ్యుడిగా ఉన్నాడు. 2019 నుంచి రస్సెల్ కేవలం టీ20 ల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ ప్రాంచైజీ లీగ్ లలో కొనసాగనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ కోల్ కతా తరఫున అడుతుండగా ఈ టీం తరఫున ఆడడం తనకు చాలా ఇష్టమని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. 37 ఏళ్ల అండ్రూ రస్సెల్ మొత్తం 84 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వెస్టిండిస్ ఆల్ రౌండర్ రస్సెల్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఫార్మాట్ ఏదైనా లీగ్ ఎక్కడైనా రస్సెల్ దూకుడుగా ఉంటాడు. ఏ లీగ్ లో అడుగుపెట్టిన విధ్వంసమే చేస్తాడు.
Andre Russell
retirement from international cricket