BCCI Cricket Schedule : సెప్టెంబర్, అక్టోబర్‌లో మరో క్రికెట్ సమరం.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టూర్ షెడ్యూల్ విడుదల

BCCI Cricket Schedule : భారతదేశ క్రికెట్ అభిమానులకు బీసీసీఐ (BCCI) మరో గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఆస్ట్రేలియా మహిళల జట్టు, ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు, సౌత్ ఆఫ్రికా ‘ఏ’ జట్టు భారత పర్యటనకు రాబోతున్నాయి. ఈ పర్యటనలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇది సీనియర్ మెన్స్ టీమ్స్ పర్యటన కానప్పటికీ క్రికెట్ అభిమానులు, ఆటను ప్రేమించే వారికి మాత్రం పండుగనే చెప్పాలి.
ఆస్ట్రేలియా పర్యటన
సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఆస్ట్రేలియా టీమ్స్ భారత పర్యటనలో ఉంటాయి. మొత్తం 13 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
ఆస్ట్రేలియా మహిళల జట్టు: సెప్టెంబర్ 14 నుండి 20 మధ్య భారత్‌తో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లూ చెన్నైలో జరగనున్నాయి.
సెప్టెంబర్ 14: మొదటి వన్డే (చెన్నై)
సెప్టెంబర్ 17: రెండో వన్డే (చెన్నై)
సెప్టెంబర్ 20: మూడో వన్డే (చెన్నై)
Read Also:IPL 2025 Qualifier 1 : 20ఓవర్స్ అక్కర్లేదు.. 36బంతుల్లోనే తేలనున్న PBKS vs RCB మ్యాచ్ ఫలితం
ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు: సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 5 వరకు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు (Multi-day matches), మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
మల్టీ-డే మ్యాచ్‌లు (లక్నోలో):
సెప్టెంబర్ 16 నుండి: మొదటి మల్టీ-డే మ్యాచ్
సెప్టెంబర్ 23 నుండి: రెండో మల్టీ-డే మ్యాచ్
వన్డే మ్యాచ్‌లు (కాన్పూర్‌లో):
సెప్టెంబర్ 30: మొదటి వన్డే
అక్టోబర్ 3: రెండో వన్డే
అక్టోబర్ 5: మూడో వన్డే
Read Also:Urinary Infection : మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ 7 వ్యాధులకు సంకేతం కావచ్చు!
సౌత్ ఆఫ్రికా ‘ఏ’ జట్టు పర్యటన
ఆస్ట్రేలియా జట్ల పర్యటన ముగిసిన తర్వాత, అక్టోబర్-నవంబర్ నెలల్లో సౌత్ ఆఫ్రికా ‘ఏ’ జట్టు భారత్‌కు రానుంది. వారి పర్యటన అక్టోబర్ 30 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 20 రోజులు ఉంటుంది. ఈ సమయంలో సౌత్ ఆఫ్రికా ‘ఏ’ జట్టు రెండు మల్టీ-డే మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
మల్టీ-డే మ్యాచ్‌లు: ఈ మ్యాచ్‌లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Centre of Excellence)లో జరుగుతాయి.
అక్టోబర్ 30 నుంచి: మొదటి మల్టీ-డే మ్యాచ్
నవంబర్ 6 నుంచి: రెండో మల్టీ-డే మ్యాచ్
వన్డే మ్యాచ్‌లు: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి.
నవంబర్ 13: మొదటి వన్డే
నవంబర్ 16: రెండో వన్డే
నవంబర్ 19: మూడో వన్డే
ఈ అంతర్జాతీయ మ్యాచ్‌లతో భారత క్రికెట్ అభిమానులకు వచ్చే కొన్ని నెలలు పండుగ వాతావరణం నెలకొననుంది.