IPL 2025 Qualifier 1 : 20ఓవర్స్ అక్కర్లేదు.. 36బంతుల్లోనే తేలనున్న PBKS vs RCB మ్యాచ్ ఫలితం

IPL 2025 Qualifier 1 : ఐపీఎల్ 2025లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగబోతోంది. ఫైనల్ టిక్కెట్ కోసం ముల్లన్‌పూర్‌లో జరిగే ఈ కీలక మ్యాచ్‌ను కేవలం 36 బంతుల్లోనే నిర్ణయించవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. “20 ఓవర్ల మ్యాచ్ 36 బంతుల్లో ఎలా ముగుస్తుంది?” అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ 36 బంతులు రెండు జట్ల బలాబలాలకు సంబంధించినవి.
వాస్తవానికి పంజాబ్, బెంగళూరు మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ 20 ఓవర్ల పూర్తి మ్యాచ్‌గానే జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలకమైనవి పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లు) లో వేసే 36 బంతులు మాత్రమే. అంటే, ఈ 36 బంతుల్లో రెండు జట్ల ఆటతీరే మ్యాచ్ ఫలితాన్ని భారీగా ప్రభావితం చేయబోతోంది.
Read Also:Gaddar Awards : అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. గద్దర్ అవార్డ్స్ విజేతలు వీరే
పవర్‌ప్లేలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ ప్రధాన బలం. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇదే పవర్‌ప్లేలో బౌలింగ్ కీలకం. మొత్తంగా చూస్తే, క్వాలిఫైయర్ 1 లో పవర్‌ప్లే సమయంలో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి.
పవర్‌ప్లేలో పంజాబ్ బ్యాటింగ్ బలాన్ని చూపే గణాంకాలు ఆశ్చర్యపరుస్తాయి. IPL 2025లో పంజాబ్ జట్టు పవర్‌ప్లేలో ఓవర్‌కు సగటున 10.02 పరుగులు చేసింది. ఈ దశలో ఇంత ఎక్కువ సగటుతో పరుగులు చేసిన జట్టు మరేదీ లేదు. ఇది ఆ జట్టు ఆటగాళ్ల దూకుడుకు నిదర్శనం.
Read Also:Blood Test : రక్తం తీయకుండానే బ్లడ్ టెస్ట్.. 20 సెకన్లలో ఫేస్ స్కాన్‌తో రిపోర్టులు రెడీ
మరోవైపు, RCB బౌలింగ్ పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో సిద్ధహస్తులు. దీనికి నిదర్శనంగా వారి ఎకానమీ రేట్ 8.79 ఉంది. ఇది మిగిలిన జట్లతో పోలిస్తే చాలా తక్కువ. అంతేకాకుండా, పవర్‌ప్లేలో RCB అత్యధికంగా 43.5శాతం డాట్ బాల్స్ వేసింది. ఇది ప్రత్యర్థి బ్యాట్స్మెన్లపై వారి పట్టును సూచిస్తుంది.
పవర్‌ప్లేలోని ఈ 36 బంతుల్లో బ్యాట్, బంతి మధ్య కనిపించే వ్యత్యాసమే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫైయర్ 1లో ఎవరు గెలిచి ఫైనల్ టిక్కెట్ పొందుతారో నిర్ణయిస్తుంది. పవర్‌ప్లేలో బ్యాటింగ్‌పై ఆశలు పెట్టుకున్న పంజాబ్ వెళ్తుందా? లేక పవర్‌ప్లే బౌలింగ్‌తో గెలుస్తామని నమ్ముతున్న బెంగళూరు వెళ్తుందా? ఈ రోజు మ్యాచులో చూడాలి.