Gaddar Awards : అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. గద్దర్ అవార్డ్స్ విజేతలు వీరే
తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను' తొలిసారిగా ప్రకటించింది.

Gaddar Awards : తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను’ తొలిసారిగా ప్రకటించింది. ఈ పురస్కారాలు కేవలం నటీనటులకే కాకుండా, సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాలు, విభిన్న కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలకూ గుర్తింపునిస్తున్నాయి. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా సీనియర్ నటి జయసుధ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2014 నుంచి 2023 వరకు ప్రతేడాదికి సంబంధించిన ఉత్తమ చలన చిత్రంతో పాటు, ఇతర విభాగాల విజేతల జాబితాను విడుదల చేశారు. దాదాపు 1248 నామినేషన్లు (1172 వ్యక్తిగత విభాగాల్లో, 76 ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ తదితర విభాగాల్లో) వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విజేతలను ఎంపిక చేసినట్లు వారు తెలిపారు.
‘కల్కి 2898 ఏడీ’కి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్
2024 సంవత్సరానికి ‘ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ దక్కించుకుంది. ఈ విభాగంలో ‘పొట్టేల్’ రెండో ఉత్తమ చిత్రంగా, ‘లక్కీ భాస్కర్’ మూడో ఉత్తమ చిత్రంగా నిలిచాయి.
Read Also: మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ 7 వ్యాధులకు సంకేతం కావచ్చు!
ఇతర ముఖ్యమైన విభాగాల్లో విజేతలు వీరే
బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: (35 ఇది చిన్న కాదు)
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్: వంశీ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ హోల్ సేల్ ఎంటర్‌టైనర్‌మెంట్: ఆయ్
బెస్ట్ డైరెక్టర్: నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
బెస్ట్ స్క్రీన్ ప్లే: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ కమెడియన్: సత్య, వెన్నెల కిషోర్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మేల్): ఎస్. జె. సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (ఫిమేల్): శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: బీమ్స్ (రజాకార్)
బెస్ట్ మేల్ సింగర్: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
బెస్ట్ ఫీమేల్ సింగర్: శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్స్: మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కాదు), బేబీ హారిక
బెస్ట్ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ గేయ రచయిత: చంద్రబోస్ (రాజూ యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య
Read Also: రక్తం తీయకుండానే బ్లడ్ టెస్ట్.. 20 సెకన్లలో ఫేస్ స్కాన్‌తో రిపోర్టులు రెడీ
ఈ అవార్డులతో పాటు జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, బాలల చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన చిత్రాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందించనున్నారు. యానిమేషన్ చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు, లఘు చిత్రాల విభాగాల్లోనూ అవార్డులు ప్రదానం చేస్తారు. సినీ విశ్లేషకులకు, రచయితలకు కూడా పురస్కారాలు దక్కనున్నాయి.
-
Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పై కోమటిరెడ్డి తిరుగుబావుటా
-
CM Revanth Reddy Plane: సీఎం రేవంత్ రెడ్డి… సామాన్యుడిగా ప్రయాణించి అందరి మనసులు గెలుచుకున్న నేత
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..