Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పై కోమటిరెడ్డి తిరుగుబావుటా
Komatireddy Rajagopal Reddy తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నడని తెలిపారు.

Komatireddy Rajagopal Reddy: రేవంత్ రెడ్డి పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అంటూ ప్రకటించుకోవడాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నడని తెలిపారు. మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని మళ్లీ తామే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి తరుచూ ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. తనదారి తాను చూసుకుంటానని ఇటీవల బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి తానేనంటూ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
-
CM Revanth Reddy Plane: సీఎం రేవంత్ రెడ్డి… సామాన్యుడిగా ప్రయాణించి అందరి మనసులు గెలుచుకున్న నేత
-
DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్..డీకే శివకుమార్ సీఎం అవుతారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Gaddar Awards : అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. గద్దర్ అవార్డ్స్ విజేతలు వీరే
-
Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది.. అందుకే వాయిదా పడింది
-
KTR: రేవంత్ దూకే గోడలు కేటీఆర్ కు ఎలా తెలుసు.. పోలీసులు లీకులు ఇస్తున్నారా?