Bandi Sanjay: కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay బీసీలకు 5 శాతం పెండి.. ముస్లింలకు అదనంగా పదిశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Bandi Sanjay: కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశాడు. కామారెడ్డి డిక్లరేషన్ కాదని ముస్లిం డిక్లరేషన్ అని అన్నాడు. బీసీలకు 5 శాతం పెండి.. ముస్లింలకు అదనంగా పదిశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బీసీ ముసుగులో ముస్లింలకు వందశాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీలకు మద్దతు కరువైందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని క్లారిటీ ఇచ్చారు. 27 మంది బీసీ కేంద్రమంత్రులను, అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించిన ఘనత బీజేపీదేనని అన్నారు. యూపీ, బెంగాల్, బీహార్ తరహాలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగవడ ఖయమని అన్నారు.