Bandi Sanjay: సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ
Bandi Sanjay కేటీఆర్ భాషను మార్చుకోవాలని పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని బండిసంజయ్ హెచ్చరించారు.

Bandi Sanjay: సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని పక్కన బెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశాడు. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి, కవిత విషయంలో విచారణ ఆపాలని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు.
కేటీఆర్ భాషను మార్చుకోవాలని పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని బండిసంజయ్ హెచ్చరించారు. వీటిపై కరీంనగర్ కు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలు నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సద్ధమా అంటూ ప్రశ్నించారు.