KTR: రేవంత్ దూకే గోడలు కేటీఆర్ కు ఎలా తెలుసు.. పోలీసులు లీకులు ఇస్తున్నారా?
KTR: ఇది చదవడానికి కాంగ్రెస్ నాయకులు కొంతగా ఇబ్బంది పడవచ్చు. మా పై ఒక రకంగా విమర్శలు చేయవచ్చు.. నిష్టూరమైన నిజం ఏమిటంటే..

KTR: ఇది చదవడానికి కాంగ్రెస్ నాయకులు కొంతగా ఇబ్బంది పడవచ్చు. మా పై ఒక రకంగా విమర్శలు చేయవచ్చు.. నిష్టూరమైన నిజం ఏమిటంటే.. ఇవాల్టికి ముఖ్యమంత్రి కి పోలీస్ శాఖపై పట్టులేదు. ఐఏఎస్ అధికారులపై గ్రిప్ లేదు. ఐపీఎస్ లపై కట్టడి లేదు. మొత్తంగా చూస్తే అయోమయం జగన్నాథం.. ఇవీ తెలంగాణ పౌర సమాజం చేస్తున్న ఆరోపణలు.
నిన్న కేటీఆర్ ఏమన్నాడు.. రేవంత్ రెడ్డి ఎక్కడ గోడలు దూకుతున్నాడో మాకు తెలియదా.. ఉదయమే ఐదు గంటలకు సొంత డ్రైవింగ్ తో వితౌట్ సెక్యూరిటీతో.. ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలుసు.. సాగర్ సొసైటీ, మై హోం భుజ్ కు ఉదయమే ఐదు గంటలకు ఎందుకు వెళ్తాడో మాకు తెలుసు.. ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మా వద్ద సమాచారం ఉంది. రేఖలు, తారలు, వాణిల గురించి మా దగ్గర బోలెడు సమాచారం ఉంది. లెక్కకు వస్తే ఫోటోలు కూడా బయటకు రిలీజ్ చేస్తాం.. కేటీఆర్ విమర్శించడాని కాదు గాని.. తెలంగాణ రాజకీయాల్లో నాయకులతో తారలకు ఉన్న సంబంధాలు కొన్ని సంవత్సరాలుగా చర్చకు దారి తీస్తున్నాయి. ఇక్కడ రేఖ, వాణి, తార పేరుతో కేటీఆర్ ఎలాంటి విమర్శలు చేయదలచుకున్నాడో తెలియదు కానీ.. నిజానికి అంత పొద్దున రేవంత్ బయటికి వెళ్లి ఏం చేస్తాడు.. గోడలు దూకాల్సిన అవసరమేంటి.. అసలు ముగ్గురు మహిళలతో ఏకకాలంలో ఏం చేస్తాడు? అనే ప్రశ్నలు కాస్త పక్కన పెడితే.. ఇక్కడ కేటీఆర్ ఎలాంటి ఆరోపణలు చేశాడు.. అందులో నిజం ఎంత.. అనే వాటి గురించి కాదు..
నిజానికి కేటీఆర్ దగ్గరికి అలాంటి సమాచారం ఎలా వెళ్తోంది? నిజంగా అతని వద్ద ఫోటోలు ఉన్నాయా? గతంలో షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ట్యాపింగ్, ఇతర నిఘా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రేవంత్ కదిరి కల మొత్తం పై స్కెచ్ వేసి ఉండవచ్చు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా.. అలాంటప్పుడు పోలీస్ శాఖ కేటీఆర్ కు ఎలా సహకరిస్తుంది.. అంటే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు పోలీస్ శాఖలో కేటీఆర్ కు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా..
ఒకవేళ కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నాడు అని అనుకుందాం.. రేవంత్ రెడ్డి పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నాడు అనుకుందాం.. ఒక ముఖ్యమంత్రి ఉదయం ఐదు గంటలకే సెల్ఫ్ డ్రైవింగ్ తో హైదరాబాదులో తిరగగలడా.. తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి.. ఎక్కడికో వెళ్లడం సాధ్యమేనా..
ముఖ్యమంత్రి బయటికి వస్తే సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ప్రోటోకాల్ ఉంటుంది. ముందస్తుగా ప్లానింగ్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఒంటరిగా వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది..
ఇప్పుడు నీకు నొప్పి గుర్తుకొస్తుంది.. మీ కుటుంబం బాధపడుతోంది.. మరి మా కుటుంబాలను ఇలా చేసినప్పుడు మేము ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా.. అని కేటీఆర్ అంటున్నాడు.. అంటే ఈ లెక్కన కావాలని కేటీఆర్ అండ్ కో రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు అనుకోవాలా..
ఇప్పటికే రేవతి బ్యాచ్ తో రేవంత్ రెడ్డి పై గులాబీ గ్యాంగ్ ఇష్టానుసారంగా విమర్శలు చేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చిపోయాడు. నాన్ జర్నలిస్టులను ఉప్పు పాత్ర వేస్తామని హెచ్చరించాడు. రేవంత్ చేసిన ఆరోపణ తర్వాత ఇప్పుడు నీకు వాస్తవం గుర్తుకు వస్తున్నదా అని కేటీఆర్ వ్యాఖ్యానించాడు. అంటే పరోక్షంగా ఇదంతా కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉందని కేటీఆర్ చెప్పేశాడా?
రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్ మీద ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే.. నాడు మేము నిశ్శబ్దంగా ఉన్నాం.. ఇప్పుడు అతడికి నొప్పి తెలియాలని మేము చేస్తున్నాం.. అంటే రేవంత్ రెడ్డి కదలికలు కేటీఆర్ కు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయనే కదా అర్థం..
ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని రేవంత్ వర్సెస్ కేటీఆర్ విమర్శల్లో చాలా కనిపిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం పాత సర్కారు అక్రమాలపై విచారణ జరగడం లేదు.. కొత్త సర్కారు చేస్తున్న తప్పులపై చర్చ లేదు.. స్థూలంగా చూస్తే ఓట్లు వెత గెలిపించిన ప్రజలు వెర్రివాళ్లు.