CM Revanth Reddy Plane: సీఎం రేవంత్ రెడ్డి… సామాన్యుడిగా ప్రయాణించి అందరి మనసులు గెలుచుకున్న నేత
CM Revanth Reddy Plane సీఎం పదవిలో ఉండి సాధారణ వర్గాల్లో కలిసిపోయే రేవంత్ తీరు, ప్రజలతో నేరుగా మమేకమవుతున్న నేతగా ఆయనను మిగతా రాజకీయ నేతల నుంచి ప్రత్యేకంగా చూపిస్తోంది.

CM Revanth Reddy Plane: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సాధారణ ప్రయాణికుడిలా విమానంలో ప్రయాణించిన తీరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఆయన, ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకొని ఇతర ప్రయాణికులతో కలిసి సీటులో కూర్చుని విమాన ప్రయాణం పూర్తిచేశారు.
ఈ సందర్భంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఎంతో సరళంగా, అహంకారం లేకుండా ప్రజల మధ్య ప్రయాణించడం చూసిన నెటిజన్లు రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా, అధికారం ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలి పాటించడం అంటే నిజమైన ప్రజా నాయకుడి గుణమేనని అంటున్నారు.
సీఎం పదవిలో ఉండి సాధారణ వర్గాల్లో కలిసిపోయే రేవంత్ తీరు, ప్రజలతో నేరుగా మమేకమవుతున్న నేతగా ఆయనను మిగతా రాజకీయ నేతల నుంచి ప్రత్యేకంగా చూపిస్తోంది. రాజకీయాల్లో పారదర్శకత, వినమ్రత అవసరం ఉన్న సమయంలో ఆయన చూపిన చిరునవ్వు నెట్‌లో నన్నెపట్టింది.
రేవంత్ రెడ్డి…❤️🔥
“ప్రతి సీఎం రేవంత్ రెడ్డిలా ఉండాలి” అనే మాట భవిష్యత్ తరాలు మాట్లాడుకునేలా ఆయన పేరు నిలిచిపోతుంది..!!😊సీఎం అయినా సాధారణ వ్యక్తిలా విమాన ప్రయాణం✈️@revanth_anumula 🫡 pic.twitter.com/CaHPqQidlX
— Geetha Ainala (@GeethaAinala) July 16, 2025
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
CM Revanth Reddy health Tips: బట్టలు ఉతుక్కోండి.. జొన్న రొట్టె తినండి.. సీఎం ఆరోగ్య సూత్రాలు!
-
Kaleshwaram Commission shocks Revanth Govt: రేవంత్ సర్కార్‌కు కాళేశ్వరం కమిషన్ షాక్.. కేసీఆర్ విచారణ తర్వాత కొత్త మలుపు
-
Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్
-
Gaddar Awards : అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. గద్దర్ అవార్డ్స్ విజేతలు వీరే