Yash Dayal: క్రికెటర్ యశ్ దయాళ్ పై పోక్స్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే
Yash Dayal యశ్ దయాళ్ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. 2

Yash Dayal: క్రికెటర్ యశ్ దయాళ్ పై పోక్స్ కేసు నమోదు అయ్యింది. రెండు సంవత్సరాలుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్ కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీసులు యశ్ దయాళ్ పై పోక్సో కేసు నమోదు చేశారు. వివాహం పేరుతో యశ్ తనను లైంగికంగా వాడుకున్నడని ఆరోపించింది.
యశ్ దయాళ్ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. 2024 నుంచి ఆర్సీబీ లో భాగంగా ఉన్నాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 లో టైటిల్ ను గెలవడంలో యశ్ ముఖ్యపాత్ర పోషించాడు. 13 వికెట్లు పడగొట్టాడు. అతడికి ఇది రెండో ఐపీఎల్ టైటిల్. 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచిన జట్టులో యశ్ సభ్యుడు. ఇప్పటి వరకు 43 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అతడు 41 వికెట్స్ పడగొట్టాడు.
Related News