Harbhajan Singh: శ్రీశాంత్ తో వివాదంపై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Harbhajan Singh ఇన్ని సంవత్సారాలు గడిచిప్పటికి కూడా ఈ ఘటనపై ప్రతి సందర్భంలోనూ పశ్చాత్తాపడుతూనే ఉంటానన్నాడు.

Harbhajan Singh: శ్రీశాంత్ ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన వివాదం 17 సంవత్సరాలు గడిచిన ఎవరూ మరిచిపోలేదు. హర్బజన్ సింగ్ ఎన్నో సార్లు క్షమాపణ చెప్పినప్పటికి కూడా ఇంకా ఈ విషయం పై చర్చ జరుగుతుంది. అయితే రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ తన జీవితంలో ఏదైన మార్చుకునే అవకాశం వస్తే అది శ్రీశాంత్ తో జరిగిన ఘటననే అని అన్నాడు. నేను అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు.
ఇన్ని సంవత్సారాలు గడిచిప్పటికి కూడా ఈ ఘటనపై ప్రతి సందర్భంలోనూ పశ్చాత్తాపడుతూనే ఉంటానన్నాడు. ఈ ఘటన జరిగిన చాలా సంవత్సారాల తరువాత శ్రీశాంత్ కూతురిని కలిసినట్లు హర్భజన్ తెలిపాడు. ఆ సమయంలో ఆ చిన్నారి తో ప్రేమతో మాట్లాడాలని ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ చిన్నారి మాత్రం నాతో మాట్లాడడని చెప్పిందన్నాడు. నువ్వు మా నాన్నని కొట్టావు అని చిన్నారి అనండంతో ఎంతో బాధపడ్డనని తెలిపాడు. ఇప్పటికైతే ఆ చిన్నారికి క్షమాపణలు మాత్రమే చెప్పగలను. అంతకు మించి ఏమీ చేయలేను అన్ని అన్నాడు.