MP Avinash Reddy Arrested: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్టు
MP Avinash Reddy Arrested ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాటెట్ విధానంలో పోలింగ్ జరగనుంది.

MP Avinash Reddy Arrested: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి, అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఎన్నికలకు కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాటెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Related News