Perni Nani: అజ్ఞాతంలోకి పేర్ని నాని.. ఎందుకో తెలుసా?
Perni Nani రప్పా.. రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పేర్ని నానిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రప్పా రప్పా అని చెప్పడం కాదు.. రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హైకోర్టులో ముందస్తుబెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే రప్పా.. రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పేర్ని నానిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్టేషన్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అయితే ముందస్తు బెయిల్ దక్కలేదని పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు.