Polavaram Project Upper Coffer Dam: దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్
Polavaram Project Upper Coffer Dam ఎగువన ఎత్తు, వెడల్పు పెంచిన చోటే ఇప్పుడు కొంతమేర నిర్మాణం దెబ్బతిన్నట్లు సమాచారం, అయితే దీనివల్ల పెద్దగా నష్టం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

Polavaram Project Upper Coffer Dam: వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్ దెబ్బతింది. 10 అడుగలు వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు డ్యామేజ వాటినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2022 ఆగస్ట్ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్ కొంతమేర దెబ్బతింది. దిగువన బట్రన్ డ్యాం నిర్మాణం, ఎగువన ఎత్తు, వెడల్పు పెంచిన చోటే ఇప్పుడు కొంతమేర నిర్మాణం దెబ్బతిన్నట్లు సమాచారం, అయితే దీనివల్ల పెద్దగా నష్టం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు కూడా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాపర్ డ్యాం నుంచి సీపేజ్ కొనసాగుతుండడంతో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేస్తూ డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Related News